Maheshbabu Rajamouli: టాలీవుడ్ లో మరో సంచలనానికి తెరతీస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలిసి ఓ ప్రాజెక్టును మొదలు పెట్టనున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా అయ్యాక మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్టు తెరపైకి వెళ్లనుంది. వీరిద్దరి కాంబోలో మొదటి సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ఉన్నారు.
మహేష్ బాబు తన 29వ చిత్రం రాజమౌళితో చేయనున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత అదే స్థాయిలో, ఇంకా చెప్పాలంటే అంతకు మించి హిట్ కొట్టాలని ఉన్నారు. దీంతో మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా కథ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఫైనలైజ్ స్టేజ్ కి చేరుకుందట. అయితే, వీరిద్దరి ప్రాజెక్టు మొదలు కావడానికి ఇంకా సమయం ఉంది.
దీనిపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. కానీ, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఓ సంస్థతో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. కథపై కూడా అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. మహేష్ బాబును కథ పరంగా రెడీ చేసేలా రాజమౌళి సిద్ధమవుతున్నారట. ఈ మూవీలో అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారని వినికిడి.
Maheshbabu Rajamouli: మరో రెండు నెలల్లో రెగ్యులర్ షూటింగ్.. కానీ..
రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ ముందే అనుకున్న ప్రకారం 2023 జనవరి నుంచి మొదలు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్.. ఆ ప్రాజెక్టు పూర్తయ్యాకే రాజమౌళి సినిమా మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఆ మూవీ ఎప్పుడు అయిపోతుందో అని మహేష్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కనీసం 2023 ఏప్రిల్ నాటికైనా తన ప్రాజెక్టు పట్టాలెక్కాలని రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2025లో సినిమా విడుదల చేసేందుకు ముహూర్తం పెట్టుకున్నారట.