Mahesh Babu : మహేష్ బాబు తాజాగా ఓ సెల్ఫీ షేర్ చేశాడు. అందులో మహేష్ బాబును చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అసలు మనోడు స్లిమ్‌గా ట్రిమ్‌గా అందానికి ఐకాన్‌లా ఉంటాడు. కాలేజ్ స్టూడెంట్ అంటే నమ్మేస్తారు. రోజు రోజుకూ మరింత యంగ్‌గా తయారవుతున్నాడు. మహేష్ బాబు విషయంలో ఏజ్ అనేది రివర్స్ గేర్‌లో పని చేస్తుంటుందా? అని అనిపిస్తుంటుంది చూసేవారెవరికైనా. మహేష్ బాబు అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం కొత్త మేకోవర్‌ను ట్రై చేస్తోన్నట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు మహేష్ బాబు సెల్పీ పిక్ చూసిన వారంతా అవాక్కవుతున్నారు.
మరీ చిన్న పిల్లాడిలా ఉన్నాడని మహేష్ బాబు గురించి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అసలు తనకి 47 ఏళ్లంటే ఎవరైనా నమ్ముతారా? అలా ఉండటానికి ఎంత మెయిన్‌టైన్ చేయాలి. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న SSMB 28 సినిమా అప్డేట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. SSMB 28 ఆరంభం అంటూ వీడియో వదిలారు. అందులో మహేష్ బాబు లుక్, తమన్ బీజీఏం అన్నీ కూడా అదిరిపోయాయి. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Mahesh Babu : రెస్ట్ అండ్ రీచార్జ్
కాగా.. మహేష్ బాబు తాజాగా షేర్ చేసిన సెల్ఫీలో.. రెస్ట్ అండ్ రీచార్జ్ అని చెప్పుకొచ్చాడు. దాంతో పాటుగా ఐఫోన్ 14 మ్యాక్స్ ప్రో అనే హ్యాష్ ట్యాగ్ పెట్టాడు. అంటే మహేష్ బాబు కొత్తగా ఫోన్ కొనేసినట్టు అర్థమవుతోంది. కొత్త ఫోన్‌లో సరికొత్త మహేష్ అన్నమాట. ఇకమరోవైపు రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఫ్యాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజమౌళి చెప్పిన చిన్న మాట, జానర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచాన్ని చుట్టి వచ్చే అడ్వంచరెస్ సినిమా అని చెప్పడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం పాన్ వరల్డ్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. హాలీవుడ్‌లో కూడా రిలీజ్ కానుందని టాక్. ఇంకేముంది ఫ్యాన్స్ భూమ్మీద నిలవడం లేదు. కానీ ఇంకా కథ పూర్తి కాలేదు. స్క్రిప్ట్ వర్క్ పూర్తవ్వలేదని టాక్.