Mahesh Babu : సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుటుంబానికి ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం ఒకే ఒక్క ఏడాదిలోనే తల్లి, సోదరుడు, ఇప్పుడు తండ్రిని మహేష్ కోల్పోయాడు. నిజంగా ఇది తట్టుకోలేని విషాదం. తల్లి మరణించిన సమయంలోనే మహేష్ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఆయన కూతురు సితార సహా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇక తండ్రి మరణం సైతం ఎవరూ తీర్చలేని లోటు. గత కొంత కాలంగా అనారోగ్యంగో బాధపడుతున్న సూపర్‌స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
కృష్ణ మరణంతో విషాదంలో ఘట్టమనేని ఇంట విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని మహేష్ బాబుకైతే ఇది ఏమాత్రం జీర్ణించుకోలేని ఘటన. తండ్రి అంటే ఎంత ఇష్టమో మహేష్ పలు సందర్భాల్లో చెప్పాడు.‘నాన్న నాకు దేవుడితో సమానం’ అని మహేష్ చెప్పడం ఆయన ఫ్యాన్స్‌కు బాగా తెలుసు. దేవుడితో సమానంగా ఆరాధించిన వ్యక్తి లేడనేసరికి మహేష్ తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడా దేవుడే లేడననే విషయాన్ని మహేశ్ తట్టుకోలేకపోతున్నాడు. తండ్రి తుది శ్వాస పెట్టే సమయంలో ఆసుపత్రిలోకి పరుగు తీసిన వీడియో సైతం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తండ్రి పార్థీవదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అభిమానులు సైతం తల్లడిల్లుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మహేష్‌కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా మహేశ్ గతంలో అంటే తన సోదరుడు రమేష్ బాబు మరణించిన సమయంలో ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొని మహేష్ మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ సమయంలో మహేష్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. ‘నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమయ్యారు. కానీ ఏది జరిగిన మీ అభిమానం మాత్రం మారలేదు. అలానే ఉంది. ఇది చాలు.. ధైర్యంగా ముందుకు వెళ్లడానికి ’ అంటూ అభిమానులనుద్దేశించి వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.