సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా చేయించుకున్న సర్జరీ కారణంగా ఆయన పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ లేట్ అవుతుంది.ఫిల్మ్ సర్కిల్స్ వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరిలో పూర్తి కానున్నది.ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాజమౌళి ఈ మూవీ రిలీజ్ అనంతరం మహేష్ మూవీ పై కసరత్తు చేయనున్నారు.దీన్ని బట్టి చూస్తుంటే రాజమౌళి మూవీలో మహేష్ ఊహించిన దానికంటే ముందే పాల్గొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.పైగా రాజమౌళితో మూవీ అంటే హీరోలు రెండేళ్లు మరే ఇతర ప్రాజెక్ట్ లో కనిపించకుండా పూర్తిగా ఆ మూవీ మీదే దృష్టి సారించాలి కావున ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా అనౌన్స్ చేసిన త్రివిక్రమ్-మహేష్ మూవీ సందిగ్ధంలో పడింది.