Mahesh Babu: తెలుగులో టాప్ హీరోల జాబితా తీస్తే అందులో ప్రభాస్. మహేష్ బాబులు ఖచ్చితంగా ఉంటారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా పేరును ప్రపంచానికి ప్రభాస్ పెంచేశాడు. దాంతో పాటు తాను కూడా ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే కేవలం తెలుగు సినిమా కాదు.. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కాబోయే ప్యాన్ ఇండియా సినిమా.
ఘట్టమనేని నటవారసుడిగా తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టి.. సూపర్ స్టార్ గా ఎదిగిన మరో స్టార్ మహేష్ బాబు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్ సినిమా హీరోలకు ఏమాత్రం తీసిపోనట్లు ఉంటాడు మహేష్ బాబు. ఈ ఇద్దరు స్టార్స్ పక్కన సినిమా చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలని ఎంతోమంది హీరోయిన్లు భావిస్తుంటారు. కానీ ఓ హీరోయిన్ కు మాత్రం అదృష్టం మరీ ఎక్కువుంది.
అందుకే సదరు హీరోయిన్ కు ప్రభాస్ సినిమాలో ఇప్పటికే ఛాన్స్ రాగా.. మహేష్ బాబుతో కూడా సినిమా ఛాన్స్ వచ్చేసిందనే వార్త అందరికీ షాకిస్తోంది. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న దీపికకు ఇలా ఇద్దరు పెద్ద స్టార్స్ తో వరుస ఆఫర్లు వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తోంది. పెళ్లైపోయి, వయసు ఎక్కువగా ఉన్నా అమ్మడికి మంచి ఆఫర్లు వచ్చాయంటూ జనాలు అప్పుడే గుసగుసలాడుతున్నారు.
Mahesh Babu:
ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కెలో హీరోయిన్ గా దీపిక పదుకొనే ఖరారైనట్లు బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబుల కాంబినేషన్ లో రాబోతున్న భారీ సినిమాలో కూడా దీపికకు బెర్త్ ఖాయమైందని, త్వరలోనే అధికారికంగా దీనిపై ప్రకటన విడుదల అవుతుందనే ప్రచారం సాగుతోంది. ఇదే గనక నిజమైతే.. దీపికకు ఉన్నంత అదృష్టం ఎవరికీ ఉండదు అని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.