Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ గురించి వివాదాస్పదంగా బహిర్గత పర్చిన నటి శ్రీరెడ్డి. యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి.. సినిమా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన ఈమె.. కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్లు ఆరోపించింది. పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు అవకాశం ఇవ్వాలంటే తమతో సన్నిహితంగా ఉండాలని డిమాండబ్ చేసినట్లు శ్రీరెడ్డి వెల్లడించింది.
హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ ముందు నగ్నంగా నిరసనకు దిగి.. కాస్టింగ్ కౌచ్ మీద వార్తల్లో నిలిచింది. ఈ గొడవలోకి పవన్ కళ్యాణ్ ను కూడా లాగుతూ.. న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఇక దగ్గుబాటి కుటుంబానికి చెందిన దగ్గుబాటి అభిరామ్ తో కలిసి దిగిన ఫోటోలను బయట పెట్టి సెన్సేషన్ గా నిలిచింది. కాగా తాజాగా మరోసారి కాంట్రవర్సీతో శ్రీరెడ్డి వార్తల్లో నిలిచింది.
టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరుగా ఉన్న మహేష్ బాబు మీద శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్లు చేసింది. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాకు తాజాగా సైమా అవార్డులు వచ్చాయి. అయితే ఈ అవార్డ్స్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే వీటిపై శ్రీరెడ్డి కామెంట్ చేసి.. వార్తల్లో నిలిచింది.
సైమా అవార్డ్స్ కు సంబంధించి మహేష్ ఫోటోలపై శ్రీరెడ్డి.. చూడటానికి సిమ్లా యాపిల్ లా ఉన్నాడని, కొరికేయాలని అనిపిస్తుందంటూ మహేష్ బాబు గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. దీంతో ఇప్పటి వరకు మహేష్ బాబు పేరును ఎక్కడా ప్రస్తావించని శ్రీరెడ్డి చివరకు అతడి పేరును కూడా వాడేసిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
కాగా సినిమా ఛాన్సులు దొరకకపోవడంతో.. శ్రీరెడ్డి ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టేసింది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు వంటల వీడియోలను అప్ లోడ్ చేసి వాటి ద్వారా లక్షల్లో సంపాదిస్తోంది. వంట వీడియోలను హాట్ గా, బోల్డ్ కామెంట్లు, డబుల్ మీనింగ్ మాటలతో హీటెక్కించి.. ఎక్కువ వ్యూస్ ను శ్రీరెడ్డి సాధిస్తోంది.
Mahesh Babu:
ఆ ఫొటోలను చూసిన శ్రీరెడ్డి ఆయనపై దారుణమైన కామెంట్లు చేసింది. చూడటానికి సిమ్లా ఆపిల్ లా ఉన్నాడని, కొరికేయాలని అనిపిస్తుందంటూ బోల్డ్ కామెంట్లు చేసింది. దాంతో ఆ కామెంట్లు కాస్త వైరల్ అయిపోయాయి.