సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని మల్టీ టాలెంటెడ్ అనే సంగతి అందరికి తెలిసిందే. ఆమె తన టాలెంట్ ని వీడియోల ద్వారా ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన కూతురు చేసే అన్ని పనులని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు. కూతురు మీద తనకున్న ప్రేమని మహేష్ బాబు అలా ఫ్యాన్స్ తో కూడా పంచుకుంటారు. ఇక సితార సింగర్ గా, డాన్సర్ గా ఇప్పటికే చాలా వీడియోలలో తన టాలెంట్ చూపించింది. ఇప్పుడు తనలో క్లాసికల్ డాన్సర్ ఉందని కూడా ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం ఓ టీచర్ దగ్గర క్లాసికల్ డాన్స్ ని నేర్చుకుంటుంది.
అన్ని కళలలో ప్రావీణ్యం ఉండాలని చిన్న వయస్సు నుంచి మహేష్ బాబు, నమ్రత ప్రోత్సాహంతో అటుగా అడుగులు వేస్తుంది. ఇక దీపావళి సందర్భంగా సితార చేసిన క్లాసికల్ డాన్స్ వీడియోని మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యింది. చిట్టి సితారలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆమె చేస్తున్న డాన్స్ చూసి మహేష్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అలాగే క్లాసికల్ డాన్స్ లో ఎక్స్ ప్రెషన్స్ చాలా ముఖ్యం.
Wishing everyone a happy Diwali! Love, light, and happiness always ✨🙏 pic.twitter.com/QiX13ST5oH
— Mahesh Babu (@urstrulyMahesh) October 24, 2022
డాన్స్ చేస్తూనే సంగీతానికి తగ్గట్లుగా ఆమె చూపిస్తున్న అభినయం కూడా అద్భుతంగా ఉందని నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ క్లాసికల్ డాన్స్ చూస్తున్న అందరూ కూడా సితారలో కూడా నటి దాగి ఉందని భవిష్యత్తులో కచ్చితంగా తాను పెద్ద హీరోయిన్ అయిపోతుందని అప్పుడే ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా దీపావళి సందర్భంగా మహేష్ బాబు అభిమానులు తమ హీరో నుంచి ఏదైనా సర్ప్రైజ్ వస్తే బాగుండేది అని కోరుకున్నారు. అందుకు తగ్గట్లుగానే తన కూతురు క్లాసికల్ డాన్స్ వీడియోని షేర్ చేసి ఫ్యాన్స్ కి మహేష్ బాబు ట్రీట్ ఇచ్చాడనే మాట వినిపిస్తుంది.