టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. మహేష్ మోకాలు సర్జరీ కారణంగా షూటింగును వాయిదా వేసుకున్నారు. దాదాపు 70 శాతం వరకు షూట్ కంప్లీట్ అయ్యిందని టాక్. ఇక అది అలా ఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించింగా వాయిదా పడే అవకాశం ఉంది. ఆగస్టు మొదటి వారంలో విడుదలకానుందని తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఇలా ఉండగానే మహేష్ బాబు, త్రివిక్రమ్‌తో ఓ సినిమాను చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని తెలిపింది టీమ్. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో రూమర్ వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో సిస్టర్ పాత్ర కీలకంగా ఉండనుందట. దీంతో ఈ కీలక పాత్రలో హీరోయిన్ ‘సాయి పల్లవి’ని తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే మరి మహేష్ సిస్టర్‌గా సాయి పల్లవి నటిస్తుందా అనేది చూడాలి. ఇక్కడ మరో విషయం ఏమంటే ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి, మహేష్ చెల్లిగా చేస్తారా.. అనేది చూడాలి..ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఖలేజా తర్వాత ఈ కాంబినేషన్‌లో ఈ సినిమా రావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు త్రివిక్రమ్ వరుసగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాల తర్వాత వస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని హారిక హాసిని బ్యానర్‌పై చిన్నబాబు నిర్మించనున్నారు.
ఇక మహేష్ ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట విషయానికి వస్తే.. మోకాలు సర్జరీ చేయించుకున్న మహేష్, ఆర్వాత కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రెస్టు తీసుకుంటున్నారు మహేష్. ఆయన ఆరోగ్య పరిస్థితి కోలుకున్నప్పటికీ మహేష్ ఇప్పట్లో షూటింగుకి రాకపోవచ్చని అంటున్నారు. దీనికి తోడు కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువుగా అవుతున్న నేపథ్యంలో ఇప్పట్లో షూటింగ్ రిస్టార్ట్ కాకపోవచ్చని టాక్ నడుస్తోంది. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రికరించనున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తి కానుందని అంటున్నారు.