సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సారి సరికొత్త కథాంశంతో త్రివిక్రమ్ మహేష్ ని తెరపై చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథలు ఎక్కువగా కనిపిస్తాయి. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మొదటి సినిమా అతడు మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే తెరకెక్కింది. తరువాత వచ్చిన ఖలేజాలో ఏదో కొత్తగా మహేష్ ని ఆవిష్కరించే ప్రయత్నం చేయడంతో అది కాస్తా ఫ్లాప్ అయ్యింది.
అయితే ఈ సారి అలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా తనకి అలవాటైన జోనర్ నుంచి రెగ్యులర్ వేలో కాకుండా యూనివర్శల్ అప్పీల్ ఉండే సబ్జెక్టుని త్రివిక్రమ్ సిద్ధం చేసాడని టాక్. ఈ సినిమాలో సూపర్ స్టార్ కి జోడిగా పూజా హెగ్డే మరోసారి జతకడుతుంది. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉందని టాక్ ఉంది. ఇప్పటికే మహేష్ కోసం విజయేంద్ర ప్రసాద్ కథ కూడా సిద్ధం చేశారనే మాట వినిపిస్తుంది.
కె.ఎల్.నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ ని మునుపెన్నడూ చూడని పాత్రలో ఆవిష్కరించేందుకు రాజమౌళి సిద్ధం అవుతున్నట్లు బోగట్టా. దీని తర్వాత మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో షుగర్ ఫ్యాక్టరీ అనే సినిమా చేసే అవకాశం ఉందని టాక్. గతంలో సందీప్ రెడ్డి మహేష్ ని కలిసి కథ చెప్పారు. మహేష్ బాబుకి కథ నచ్చిన కూడా వరుస ప్రాజెక్ట్స్ ఉండటంతో హోల్డ్ లో పెట్టారు. ఈ నేపధ్యంలోనే రాజమౌళి పాన్ ఇండియా ప్రాజెక్ట్ తర్వాత సందీప్ సినిమాని పట్టాలు ఎక్కించే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అయితే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి కనీసం 3 ఏళ్ళ పైనే పడుతుందని భావిస్తున్నారు.