Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి వారిలో మహేష్ బాబు ఒకరు ఇలా మహేష్ బాబు వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక కొద్ది రోజులుగా మహేష్ బాబు నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అవుతూ మహేష్ బాబు అభిమానులకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు.
ఇకపోతే సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ముఖ్యంగా తన కూతురు సితార కు సంబంధించిన ప్రతి విషయాన్ని మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. సితార అంటే మహేష్ బాబు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇంత చిన్న వయసులోనే సితారలో ఎంతో టాలెంట్ ఉండడంతో మహేష్ బాబు తన కూతురి టాలెంట్ గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ మురిసిపోతుంటారు.
సితార సైతం ఇంత చిన్న వయసులోనే హీరోయిన్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకొని సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఇకపోతే సితార ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి జీ తెలుగు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. మొత్తానికి సితారను చూస్తుంటే మాత్రం భవిష్యత్తులో అగ్రతారగా పేరు సంపాదించుకుంటారు అనడంలో ఏమాత్రం సందేహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు.
Mahesh Babu: కూతురుపై వెలకట్టలేని ప్రేమను కురిపించిన మహేష్ బాబు…
ఇకపోతే డాటర్స్ డే సందర్భంగా మహేష్ బాబు తన కూతురు సితార ఫోటోని షేర్ చేస్తూ తన కూతురికి స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే తన కూతురుతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ నా ప్రపంచాన్ని ఎంతో ప్రకాశవంతంగా ఉంచిన నా చిన్నారికి శుభాకాంక్షలు అంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు సితారకు డాటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా తన కూతురిపై తనకు ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తూ మహేష్ బాబు షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.