Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి సెప్టెంబర్ 28వ తేదీ అనారోగ్య సమస్యతో మరణించిన విషయం మనకు తెలిసిందే ఇలా ఇందిరా దేవి మరణించడంతో ఎంతోమంది సెలబ్రిటీలు ఆమెను చివరి చూపు కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చారు.ఇకపోతే మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణించడంతోనే అన్ని దగ్గరుండి మహేష్ బాబు తన తల్లి అంత్యక్రియలను నిర్వహించారు.
ఈ క్రమంలోనే తన బాబాయ్ ఆదిశేషగిరిరావు మహేష్ బాబు వెంట ఉండే తన తల్లికి జరగాల్సిన కార్యక్రమాలన్నింటినీ హిందూ సాంప్రదాయాలు ప్రకారం జరిపించారు.ఇకపోతే తాజాగా ఇందిరా దేవి మరణించి ఐదు రోజులు పూర్తి కావడంతో మహేష్ బాబు హరిద్వార్ గంగా నది సమీపాన తన తల్లి కర్మకాండ నిర్వహించి తన తల్లి అస్తికలను గంగా నదిలో కలిపారు.
ఇలా మహేష్ బాబు తన తల్లికి పలు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సమయంలో తన బాబాయి ఆదిశేషగిరి రావు కూడా తన వెంటే ఉన్నారు.అయితే ఇలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహించే సమయంలో ఫోటోలను సాధారణంగా బయటకు విడుదల చేయరు అయితే అన్ అఫీషియల్ గా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది.
Mahesh Babu: తల్లికి కన్నీటి వీడ్కోలు పలికిన మహేష్..
సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా చాలామంది జాగ్రత్తలు తీసుకుంటారు ఈ క్రమంలోనే కృష్ణంరాజు కుటుంబ సభ్యులు కూడా మీడియాను దూరం పెట్టారు కాకపోతే మహేష్ బాబు ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు అనధికారికంగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక తన తల్లి పై ఎంతో ప్రేమ కలిగి ఉన్నటువంటి మహేష్ బాబు చివరిసారి తన తల్లి అస్థికలను గోదావరి నదిలో కలిపి తన తల్లికి కన్నీటి వీడ్కోలు పలికారు.