మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఒక చిత్రం చేయనున్నారు.ఈ మూవీ షూటింగ్ సర్కారు వారి పాట మూవీ అనంతరం మొదలు కానున్నది.ఇప్పటికే మూవీ కథను కంప్లీట్ చేసుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు.ఈ మూవీలో పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది.అయితే తాజాగా ఈ మూవీలో పూజ ప్లేస్ ను సమంత రీప్లేస్ చేసిందని ప్రచారం జరిగింది.
కానీ అందులో ఏమాత్రం నిజం లేదని ఈ మూవీలో పూజ హెగ్డేనే మహేష్ పక్కన హీరోయిన్ గా కనిపించబోతుందని సమాచారం.ఈ మూవీ షూటింగ్ మార్చిలో ప్రారంభం కాబోతుందని ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.