Mahesh Babu: తెలుగు హీరో అయినా హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని హీరో ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా మహేష్ బాబు. ఘట్టమనేని వారసుడిగా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోలకు ధీటుగా సూపర్ స్టార్ గా మహేష్ బాబు ఎదిగాడు. క్లాస్ లుక్ లో కనిపించే మహేష్ బాబు.. మాస్ జనాల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించాడు.
హీరో మహేష్ బాబు తల్లి ఈ మధ్యనే కాలం చేయగా.. మహేష్ ఆమె అంత్యక్రియలు, తర్వాత చేయాల్సిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నిజానికి దసరాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసే సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా.. మహేష్ ఇంట జరిగిన విషాదంతో అది ఆగిపోయింది.
దీంతో మహేష్ బాబు కొన్నిరోజుల పాటు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాడని, షూటింగ్ ను మరికొన్నిరోజులు వాయిదా వేయాలని నిర్మాతలను కోరాడట. అయితే గతకొద్ది రోజులుగా మహేష్ బాబు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని, లండన్ కు వెళ్లి చికిత్స చేయించుకోబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Mahesh Babu: మహేష్ బాబుకు మోకాలి నొప్పి..?
మహేష్ బాబు కొన్నిరోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని, అందుకే విదేశాల్లో సర్జరీ చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. మహేష్ బాబు కొడుకు గౌతమ్ లండన్ లో చదువుతుండగా.. అక్కడే కొన్నిరోజులు ఉండి, సర్జరీ చేయించుకోవాలని మహేష్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం లేదు.