Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు బుల్లితెరపై కనిపించడం చాలా అరుదు. తన సినిమా ప్రమోషన్స్ అప్పుడు తప్ప పెద్దగా కనిపించడు. తాజాగా ఓ డ్యాన్స్ షోలో మహేష్ కనిపించి మెస్మరైజ్ చేశాడు. మహేష్ ఒక్కడే కాదు.. తొలిసారిగా తన కూతురితో కలిసి డ్యాన్స్ షోలో సందడి చేశాడు. వీరిద్దరికీ ఆ షో నిర్వాహకులు బ్రహ్మరథం పట్టారు. వీరి ఎంట్రీని గ్రాండ్‌గా అరేంజ్ చేశారు. సితారతో కలిసి మహేష్ కారులో వస్తుండగా వీడియో తీశారు. అనంతరం వారి ఎంట్రీని సైతం ఓ రేంజ్‌లో చూపించారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో సితార తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సాధారణంగానే మహేశ్ షోలు, ఫంక్షన్లకు చాలా అరుదుగా వస్తుంటారు. అలాంటిది కూతురు సితారతో కలిసి తొలిసారిగా బుల్లితెరపై కనిపించనుండటంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
వచ్చే ఆదివారం ఈ షో ప్రసారం కానుంది. జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఫినాలేకు చేరుకుంది. ఈ ఫినాలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేష్, ఆయన కూతురు సితార హాజరయ్యారు. ఇప్పటికే సితార తన తండ్రి సినిమాల్లో హిట్ సాంగ్స్‌తో పాటు ఇతర సినిమాల్లోని హిట్ సాంగ్స్‌కు స్టెప్పులు వేస్తూ ఉంటుంది. ఆ వీడియోలను మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఫినాలే షోలో.. సితార స్టెప్పులు వేయడం.. మహేష్ చాలా ఆసక్తిగా గమనించడం వంటివి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుం కాగా ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Mahesh Babu : మైండ్ బ్లోయింగ్ అన్న సితార..
ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ షోలో ఇద్దరికి మహేష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు పార్టిసిపెంట్స్.. విజయ్ ఆంటోని నటించిన బేతాళుడు చిత్రంలోని సాంగ్‌కు పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ పెర్ఫార్మెన్స్ మహేష్‌కి తెగ నచ్చేసింది. ఈ సాంగ్‌లో వారిద్దరూ నటించలేదని.. జీవించేశారంటూ మహేష్ కితాబిచ్చారు. సితార సైతం ‘మైండ్ బ్లోయింగ్’ అని చెప్పి వారిని సంతోషంలో ముంచెత్తింది. ఇక మహేష్ అయితే తాను చేసే సినిమాలో కానీ.. తాను తీసే సినిమాలో కానీ మీకు తప్పకుండా ఆఫర్ ఇస్తానంటూ హామీ ఇచ్చి వారిని మరింత ఆనందంలో ముంచెత్తారు. అలాగే వారిలో ఒకరిని గుండెలకు హత్తుకుని సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. ఇక వారి ఆనందానికైతే అవధుల్లేవు.