మొదట్లో మిశ్రమ టాక్ తెచ్చుకున్న పుష్ప మూవీ ప్రస్తుతం టాలీవుడ్,బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షం కురిపిస్తుంది.బన్నీకి ఇతర భాషలలో ఉన్న క్రేజ్ ఈ మూవీకి పెద్ద ప్లస్ అయ్యింది.ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది.అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న ఈ మూవీ గురించి తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింటా వైరల్ అవుతుంది.దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి.
సినిమా బాగుంటే వారిపై పొగడ్తలు వర్షం కురిపిస్తూ ట్వీట్ చేసే మహేష్ ఇలా బన్నీ మూవీ పై ప్రశంసల వర్షం కురిపించడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.