Madhuri Dixit : బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ బుల్లితెరను తన అందం తో డ్యాన్స్ మూవ్స్ తో ఓ ఊపు ఊపేస్తోంది. ఓ డ్యాన్స్ షో కి న్యాయనిర్ణేతగా ఉన్న ఈ బ్యూటీ తనదైన ఫ్యాషన్ స్టైల్స్ తో ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేస్తోంది. లేటెస్ట్ గా ఈ ధక్ ధక్ భామ భారతదేశపు అత్యంత ప్రసిద్ధ డిజైనర్లలో ఒకరైన అనామికా ఖన్నా డిజైన్ చేసిన నలుపు రంగు అవుట్ ఫిట్ ను ధరించి అదరహో అనిపించింది. అద్భుతమైన అలంకరణలతో వచ్చిన లెహంగా డ్రెస్ లో ఆమె అందం మరింత రెట్టింపు అయ్యింది. ఈ అవుట్ ఫిట్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి మరోసారి ఇంటర్నెట్ ను షేక్ చేసింది.

Madhuri Dixit : బ్లాక్ కలర్ బ్యాక్ డ్రాప్ లో మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన ఈ లెహంగా సెట్ మాధురి మేని ఛాయకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

బ్లాక్ కలర్ లెహంగా స్కర్ట్ కి జోడిగా న్యూడ్ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ ఎంబ్రాయిడరీ తో హెవీ గా డిజైన్ చేసిన రౌండ్ నెక్ లైన్ షార్ట్ స్లీవ్స్ కలిగిన బ్లౌజ్ వేసుకుకుంది. ఈ ట్రెడిషనల్ లుక్ కి తగ్గట్లుగా చేతికి గాజులు, చేతి వేళ్ళకు ఉంగరాలు, మేడలో అందమైన నెక్ లెస్, చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ను అలంకరించుకుంది. తన గ్లామరస్ లుక్స్ తో అందరిని ఫిదా చేసింది.

రీసెంట్ గా ఝలక్ దిఖ్లా జా షో కోసం మాధురీ దీక్షిత్ ఐవరీ లెహంగా సెట్‌ను ధరించి అందరిని మేస్మరైజ్ చేసింది. సీక్విన్ బోర్డర్స్ తో వచ్చిన స్కర్ట్ వేసుకుని దానికి జోడిగా రౌండ్ నెక్ లైన్, స్లీవ్ లెస్ తో సీక్విన్ డీటెయిల్స్ తో వచ్చిన బ్లౌజ్ వేసుకుంది. స్కర్ట్ ప్యాటర్న్ లో వచ్చిన దుపట్టాను వేసుకుంది.

ఈ అవుట్ ఫిట్ కు సూట్ అయ్యేలా మేడలో గ్రీన్ ఎమెరాల్డ్స్ తో డిజైన్ చేసిన నెక్ లెస్ ఇయర్ రింగ్స్ ను పెట్టుకుంది. హెయిర్ ను లీవ్ చేసి గ్లామరస్ లుక్స్ తో అదరగొడుతోంది.
