Madhuri Dixit : ఏక్ దో తీన్ అంటూ సినీ ఇండస్ట్రీని తన అందంతో మెస్మరైజింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఓ ఊపు ఊపేసింది బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్. అగ్రకథానాయకుల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగి ఇండస్ట్రీలో తనకంటూ క్రేజ్‌ను సంపాదించుకుంది మాధురీ దీక్షిత్. ఎన్నో మరుపురాని ఎవర్ గ్రీన్ హిట్ సినిమాలు ఈ భామ కాతాలో ఉన్నాయి. వయసు 50పైనే ఉన్నా ఇప్పటికీ కుర్ర హీరోయిన్‌లను తలదన్నే సోయగాలు, ఎనర్జీ మాధురీ దీక్షిత్ సొంతం. ఆమె హావ భావాలు, డ్యాన్స్ మూమెంట్స్ ను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరేమో. మాధురీ దీక్షిత్ ప్రస్తుతం ఓ డ్యాన్స్ షోకు గెస్ట్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. డ్యాన్సర్స్ పెర్ఫార్మెన్స్ చేస్తే ఎంజాయ్ చేయడమే కాదు తానూ వారి స్టెప్పులకు పై స్టెప్పులు వూస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఈ అందాల జాబిలి అదిరిపోయే అవుట్‌ఫిట్‌ను ధరించి అందరిని అట్రాక్ట్ చేస్తోంది.

Madhuri Dixit : అవుట్‌ఫిట్ ఏదైనా తన లుక్స్‌తో ఎఫెక్టివ్‌గా చూపించగలదు బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్. ఎప్పటికప్పుడు తనదైన ఫ్యాషన్ స్టైల్స్‌ను ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రియులను అలరిస్తింది. లేటెస్ట్‌గా మాధురీ దీక్షిత్ ఓ వెస్ట్రన్ అవుట్ ఫిట్ ధరించి అందరినీ ఫిదా చేసేసింది. అమిత్ అగర్వాల్ రూపొందించిన మల్టీకలర్ అవుట్‌ఫిట్‌లో మాధురీ ఇప్పటికీ ఒకప్పటి హీరోయిన్‌లాగానే మెరిసిపోయింది.

అమిత్ అగర్వాల్ రూపొందించిన సూపర్ నోవా కలెక్షన్స్ నుంచి ఈ ప్రీ డ్రేపెడ్ సారీ గౌన్‌లో ఎంతో గ్లామరస్ గా కనిపించింది మాధురీ దీక్షిత్. ఆఫ్ షోల్డ్ ప్యాట్రన్స్, డీప్ వి నెక్‌లైన్ ప్లీటెడ్ డీటైల్స్ తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్ మాధురీకి సూపర్ గా సెట్ అయ్యింది. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా మాధురీ తన చెవులకు హూప్ ఇయర్‌రింగ్స్‌ను పెట్టుకుంది. కనులకు షిమ్మరీ ఐ ష్యాడో , పెదాలకు పింక్ టింట్ లిప్‌స్టిక్ పెట్టుకుని ఎంతో గ్లామరస్‌గా కనిపించింది. క్లీవేజ్ షో తో మైండ్ బ్లాక్ చేసింది.

మాధురీ దీక్షిత్‌కు లాగ్ గౌన్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఈ మధ్యనే ముదురు పసుపు రంగులో వచ్చిన గౌనును వేసుకుని అదరొట్టింది. భారీ ప్లీట్స్‌తో క్లాసీ స్లీవ్‌లెస్‌తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్ మాధురీ దీక్షిత్ కటౌట్‌కు కరెక్ట్‌గా సూట్ అయ్యింది. ఈ కలరల్ ఫుల్ గౌన్ కు తగ్గట్లుగా చెవులకు హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని పెదాలకు గ్లాసీ లిప్ షేడ్ దిద్దుకుని అందరిని అట్రాక్ట్ చేసింది మాధురి.

మాధురీ దీక్షిత్ అప్పుడప్పుడు కాంటెంపొరరీ అవుట్ ఫిట్స్‌ను ధరించి ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇస్తుంటుంది. అంతకు ముందు క్లాసీ ఆల్ బ్లాక్ లుక్‌లో అందరి చూపును తనవైపు తిప్పుకుంది. మెరిసేటి లేస్ వర్క్, సీక్విన్డ్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన ఈ ప్యాంట్ సూట్ లో మాధురీ లుక్ ఎంతో హాట్ గా కనిపించింది. ఈ ప్యాంట్ సూట్ మీదకు బ్లాక్ జాకెట్, డ్యాంగలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని కుర్రాళ్ల గుండెల్లో హీట్ పెంచింది.

లాంగ్ గౌన్స్, వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌లోనే కాదు చీరకట్టుతోనూ చంపేస్తుంది మాధురీ దీక్షిత్ ఈ మధ్యనే ఆకుపచ్చని రంగు చీర కట్టుకుని చెమటలు తెప్పించింది. ఈ చీరతో చేసిన ఫోటోలను మాధురీ షోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యాయి.

మాధురీ దీక్షిత్ ఓ వైపు డ్యాన్స్ షోకు హోస్ట్‌గా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో చలాకీగా ఉంటోంది. తన ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేయడానికి మాధురీ దీక్షిత్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఎప్పుటికప్పుడు తన లుక్స్ కు సంబంధించిన పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఉంటుంది.