ఈసారి మా ఎన్నికలలో ఎప్పుడూ లేనంత ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది.సుమారు 900 మంది ఉన్న మాలో ఇప్పటివరకు 626 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఎప్పుడూ మా ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్న పెద్ద హీరోలు ఈసారి పోలింగ్ లో పాల్గొనడం విశేషం.ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్,మంచు విష్ణు ప్యానెల్స్ లో విజయలక్ష్మి ఎవర్ని వరిస్తుందో వేచి చూడాలి.
ఇక ఈసారి సాధారణ ఎన్నికలను తలపించిన మా ఎన్నికలలో ఇరు ప్యానెల్ సభ్యులు నోరు జరారు.వారిపై మా క్రమశిక్షణ సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో?ఇటు వంటివి మునుముందు జరగకుండా ఉండేందుకు ఎలాంటి రూల్స్ ను తీసుకొస్తుందో వేచి చూడాలి.