లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్.. పేరుకి తగినట్టుగానే ఈ వెబ్ సిరీస్ నిండా లవ్, లస్ట్, రొమాన్సే కనిపిస్తోంది. మిల్య్ బ్యూటీ తమన్నా భాటియా, బాలీవుడ్ నటి కాజోల్, సీతా రామం ఫేమ్ మృణాల్ థాకూర్, తిలోత్తమ శోమె, విజయ్ వర్మ, అంగడ్ బేడి, కుముద్ మిశ్రా, నీనా గుప్తా, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో అడల్ట్ కంటెంట్‌ని ఇష్టపడే వారికి కావాల్సినంత వినోదం లభించనుంది అని తాజాగా విడుదలైన ట్రైలర్‌ని చూస్తే అర్థం అవుతోంది.

కామం అనేది సమాజంలో కొంతమంది జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోంది, కామం కారణంగానే కొత్త కొత్త బంధాలు ఎలా కలుస్తున్నాయి, పాత బంధాలు ఎలా చెదిరిపోతున్నాయి అనేది లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ లో చూపించారు. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో కుముద్ మిశ్రా – కాజోల్, మృణాల్ థాకూర్ – అంగడ్ బేడి, తమన్నా భాటియా – విజయ్ వర్మలు జంటలుగా కనిపించారు.
లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ని మొత్తం నలుగురు డైరెక్టర్స్ తెరకెక్కించారు. ఆర్ బల్కి, కొంకన్ సేన్ శర్మ, అమిత్ రవిందర్ నాథ్ శర్మ, సుజోయ్ ఘోష్ వంటి దర్శకులు ఈ ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేశారు. కొన్ని జంటల మధ్య కామం ప్రేమతో కూడుకున్నదైతే.. ఇంకొన్ని జంటల మధ్య కామం కేవలం శారీరక సుఖం కోసమే కూడుకున్నదని.. అలాగే ఇంకొన్ని సందర్భాల్లో ఇదే కామం లైంగిక వేధింపుల తరహాలోనూ పనిచేస్తోంది అనే అంశాలను ఈ లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ లో చూపించారు.