శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘ లవ్ స్టోరీ ‘ ముప్పై రెండు కోట్ల షేర్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తుంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దాని ప్రకారం లవ్ స్టొరీ మూవీని ప్రముఖ ఓటిటి సంస్థ అయిన ఆహా ఫ్యాన్సి ప్రైజ్ కు కొనుగోలు చేసిందని ఈ నెల 22న ఈ మూవీని తమ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారం లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది.
దీనికి సంబంధించి ఆహా నిర్వాహకుల నుండి కానీ మూవీ మేకర్స్ నుండి కానీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ప్రస్తుతం తెలుగులో జోరుగా దూసుకుపోతున్న ఆహా తన ప్రత్యర్థులు అందుకొలేనంత వేగంగా సినిమాలను,సిరిస్ లను రిలీజ్ చేస్తూ వారికి సవాలు విసురుతుంది