lose weight : మనలో చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు తమ బరువును ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మరికొందరు సన్నగా, నాజూకుగా కనిపించాలని అనుకుంటారు. మొత్తానికి ఈ రెండింటికి ఒకే పరిష్కారం బరువు తగ్గడం. అయితే బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో బరువు తగ్గాలనుకునే వారు ఖచ్చితంగా పాటించాల్సిన 5 చిట్కాలు ఉన్నాయి. వాటిని తప్పక పాటిస్తే ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.
ప్రొటీన్ డైట్ తీసుకోండి:
బరువు తగ్గాలని అనుకునే వారు ముందుగా ఏం తినాలో తెలుసుకోవాలి. అందులో భాగంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని గుర్తించుకోండి. చికెన్, గుడ్లు, చేపలు, పెరుగు, పనీర్ లాంటివి బాగా తీసుకోవాలి.
ఉదయం టిఫిన్ అస్సలు మిస్ కాకూడదు:
బరువు తగ్గాలని అనుకునే వారు చాలా వరకు ఉదయం పూట టిఫిన్ మానేస్తుంటారు. నిజానికి ఇది అస్సలు మంచిది కాదు. ఉదయం పూట తక్కువ ఆహారాన్ని తీసుకోవాలి. టిఫిన్ కింద పండ్లు, కూరగాయలు, గింజలు తీసుకోవచ్చు. తాజా పండ్లలో శరీరానికి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవే కాకుండా ఓట్స్, హోల్ గ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, బఠానీలను తీసుకుంటే శరీరానికి మంచిది.
జంపింగ్ జాక్స్ ఎక్సర్ సైజ్ చేయండి:
మనలో చాలామంది వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గుతారని నమ్ముతారు. అది నిజమే. మీరు గనక జంపింగ్ జాక్స్ ఎక్సర్ సైజ్ చేస్తే శరీరంలోని అన్ని ప్రధాన కండరాలు ఉత్తేజితమవుతాయి. గ్లూట్స్, హామ్ స్ట్రింగ్స్, క్వాడ్స్, హిప్స్, షిన్స్‌లను బలపరుస్తుంది. ఈ వ్యాయామం శక్తిని పెంపొందించడానికి, ఎక్కువ కేలరీలను బర్న్ చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
lose weight : శరీరానికి తగినంత నీరు తాగండి:
బరువు తగ్గాలని అనుకునే వారు నీటిని బాగా తీసుకోవాలని గుర్తించుకోండి. భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు నీటిని తాగడం వల్ల ఆహారాన్ని తగ్గించుకోవడానికి వీలవుతుంది.
కూల్ డ్రింక్స్ ని దూరం పెట్టండి:
మనలో చాలామందికి సీజన్ తో సంబంధం లేకుండా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. బరువు తగ్గాలని అనుకున్నప్పుడు కూల్ డ్రింక్స్ తాగడం మానెయ్యాలి. అలాగే ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించండి.