తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాని లోకేష్ ఆవిష్కరించబోతున్నాడు. ఇక లోకేష్ స్టామినా నార్త్ ఇండియన్ కి కూడా తెలియడంతో అతను కూడా పాన్ ఇండియా బాట పట్టాడు. ఈ నేపధ్యంలోనే విజయ్ సినిమాని భారీగా ప్లాన్ చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ సినిమాలు ఎలాగూ మాఫియా ఎలిమెంట్స్ తోనే ముడిపడి ఉంటాయి. యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలనే అతను ఎంపిక చేసుకుంటాడు. ఇలాంటి జోనర్ నార్త్ ఇండియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని కేజీఎఫ్ సిరీస్ ప్రూవ్ చేసింది.
ఈ నేపధ్యంలో విజయ్ తో చేస్తున్న సినిమా కూడా అదే జోనర్ కావడంతో తనకి పాన్ ఇండియాలో సక్సెస్ వస్తుందని లోకేష్ ఆలోచిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో చాలా మంది విలన్స్ ఉంటారని వినికిడి. ఇక విలన్ పాత్రలని కూడా లోకేష్ చాలా కొత్తగా డిజైన్ చేస్తాడు. ఈ నేపధ్యంలో అన్ని బాషల నుంచి విలన్ పాత్రల కోసం మెయిన్ క్యాస్టింగ్ ని ఎంపిక చేసుకోవడానికి లోకేష్ సిద్ధం అవుతున్నాడు. అందులో భాగంగా బాలీవుడ్ నుంచి స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ని మెయిన్ విలన్ రోల్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
ఇక ఈ పాత్ర కోసం అతనికి భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే తెలుగు నుంచి కూడా ఓ యంగ్ స్టార్ హీరోని విజయ్ సినిమాలో విలన్ గా ఎంపిక చేయడానికి లోకేష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఓ ఇద్దరు, ముగ్గురు హీరోలని అతను సంప్రదించాడని, వారు కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నారని టాక్. అలాగే బాలీవుడ్ హీరోయిన్ ని విజయ్ కి జోడీగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మల్టీ లాంగ్వేజ్ ల నుంచి నటీనటులని ఎంపిక చేసుకోవడం ద్వారా ఇండియన్ అప్పీల్ ని సినిమాకి తీసుకురావడంతో పాటు అన్ని బాషలలో కూడా బుజ్ ఉండేలా చూసుకుంటున్నాడు.