దర్శకుడు లోకేష్ కనగరాజ్ వరుస హిట్స్ తో సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్నాడు.దళపతి ఇప్పుడు విజయ్‌తో రెండోసారి జతకట్టాడు. గతంలో వచ్చిన మాస్టర్ సినిమా పెద్ద హిట్ అయింది.విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘లియో’.భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల బరిలో ఉంది.

అయితే ముందుగా ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలని అనుకోలేదట.కానీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అంతకుముందే విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.దళపతి 67లో మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ మీనన్ వంటి ప్రముఖులు కనిపించనున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా ఇంటర్వ్యూలలో వెల్లడించారు.
లోకేష్ విక్రమ్ కు మించిన హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో.ఇక ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయి లో రిలీజ్ చేస్తారు అని చెప్పటముతో అభిమానులు సంబరాలు చేసుకున్తున్నారు