Liver Damage Signs : ఇప్పుడున్న బిజీ లైఫెలో కొంచం ప్రీ సమయం దొరికితే చాలు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది.అలా దొరికిన ప్రీ సమయంలో చాలా మంది మనుషులు మధ్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసిన కూడా పట్టించుకోకుండా వారి వారి ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేస్తారు. అయితే బాగా తాగితే మీ లివర్ డ్యామేజ్ అయిపోతుంది. లివర్ డ్యామేజ్ వల్ల కనిపించే లక్షణాలను వాటిని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
ముదురు రంగు మూత్రం:
మీ ఆరోగ్యం ఎలా ఉందనేది మీ మూత్రం రంగు బట్టి చెప్పేస్తుంది. ముదురు రంగు మూత్రం నిర్జలీకరణాన్ని సూచిస్తుంది. శరీరంలో హానికరమైన పదార్థాల జాడను తెలియజేస్తుంది.
వికారం లేదా వాంతులు:
మానవ శరీరంలో విష పదార్థాలను తొలగించగల అవయవం కాలేయం. మనకు తరచుగా వికారం, వాంతులు అవుతుంటే.. అవి కాలేయ వ్యాధి హెచ్చరిక సంకేతాలుగా గమనించాలి.
కామెర్లు:
కాలేయ వ్యాధికి ప్రాథమిక సంకేతాలలో కామెర్లు ఒకటి. వీటి లక్షణాలలో కళ్లు, మూత్రం పసుపు రంగులోకి మారుతుంది. ఇది రక్తంలోకి విడుదలయ్యే బిలిరుబిన్ మొత్తాన్ని పెంచుతుంది. అధిక స్థాయిలో చర్మంపై దురద వస్తుంది కాబట్టి ఇది కూడా కాలేయ వ్యాధికి ప్రారంభ సంకేతం.
వాంతిలో రక్తం:
వామేట్ చేసుకొన్నపుడు వాంతుల్లో రక్తం కనిపించడం దీర్ఘకాలిక కాలేయ వ్యాధి లక్షణంగా గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Liver Damage Signs :
అలసట:
ఏ పనిచేయకుండానే అలసటగా అనిపించడం, కూడా కాలేయ వైఫల్యానికి అత్యంత సాధారణ, ప్రారంభ సంకేతాలలో ఒకటి. కొన్నిసార్లు కాలేయ సమస్యలు.. ఎటువంటి లక్షణాలు లేకుండా వస్తాయి. కాబట్టి సాధారణ శారీరక రక్త పరీక్షతో పాటు వార్షిక భౌతిక పరీక్షలు చేయించడం మంచిదని డాక్టర్లు సూచిస్తారు.