నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవ్నీత్ కౌర్ నటించిన తాజా చిత్రం ‘టికు వెడ్స్ షేరు‘. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. అందులో నవాజుద్దీన్, అవ్నీత్ కౌర్ లిప్ లాక్ సన్నివేశం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కూతురు కంటే చిన్న వయసున్న అమ్మాయితో ముద్దులేంటి? అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

టికు వెడ్స్ షేరు’ చిత్రంలో ముంబైలో తన కెరీర్ ను కొనసాగించేందుకు షేరు (నవాజుద్దీన్) ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేదే ఈ సినిమా. నటుడిగా నిలబడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో నటిగా మారాలని కలలు కనే టికు (అవ్నీత్) పరిచయం అవుతుంది. భోపాల్ నుంచి ముంబైకి వెళ్లి అక్కడ సినిమా పరిశ్రమలో రాణించాలి అనుకుంటుంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్యన జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
అయితే, ‘టికు వెడ్స్ షేరు‘ ట్రైలర్లో నవాజుద్దీన్, అవ్నీత్ మధ్య లిప్ లాక్ సన్నివేశంపై విమర్శలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య వయసును పేర్కొంటూ నెటిజన్లు ట్రోలింగ్ కు దిగుతున్నారు. నవాజుద్దీన్‌కు 49 ఏళ్లు కాగా, అవ్నీత్కు 21 ఏళ్లు. ఆయన కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ ఏంటని మండిపడుతున్నారు. ఇప్పటి వరకు నవాజ్ ను అభిమానించాను.
ఇకపై కొనసాగించలేను అని ఓ అభిమాని సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ సీన్ మరీ దారుణంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో అవ్నీత్ వయసు 20 ఏండ్లు ఉండవచ్చు. ఆమెతో లిప్ లాక్ ఏంటి అసహ్యంగా అని మరో వ్యక్తి కామెంట్ పెడ్డాడు.