రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఈ భాషలో కూడా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. సినిమా కోసం నెల రోజుల ముందు నుంచి విజయ్ అండ్ పూరీ టీమ్ గట్టిగా ప్రమోషన్ చేసింది. అయితే ప్రమోషన్ లో చాలా కాన్ఫిడెంట్ గా సినిమా ఇండియన్ వైడ్ గా దుమ్ము రేపుతుందని చెప్పుకొచ్చారు. ఇక విజయ్ దేవరకొండ అయితే కాస్తా శృతిమించి కామెంట్స్ చేశాడు.
ఇక రిలీజ్ తర్వాత సినిమా రిజల్ట్ చూసిన ఆడియన్స్ అయితే విజయ్, పూరి జగన్నాథ్ చేసిన అతి గురించి సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ పెడుతూ మీమ్స్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ అవుట్ డేట్ సబ్జెక్టుతో రౌడీ స్టార్ కెరియర్ ని నాశనం చేసాడని విజయ్ దేవరకొండ ఫాన్స్ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇక బాలీవుడ్ అయితే విజయ్ దేవరకొండ గురించి తెగ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోల మీద రకరకాల మీమ్స్ చేసిన సౌత్ ఆడియన్స్ లైగర్ చూసిన తర్వాత ఎం సమాధానం చెబుతారని విమర్శలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఇప్పుడు మరో దారుణమైన పరాభవం కూడా వచ్చింది. అత్యంత చెత్త రికార్డుని తన ఖాతాలో లైగర్ సినిమా వేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమాలకి రేటింగ్స్ ఇచ్చే ఐఎండిబి వెబ్ సైట్ లైగర్ సినిమాకి కేవలం 1.5 రేటింగ్స్ ఇచ్చింది. పది రేటింగ్ పాయింట్స్ కి గాను లైగర్ సినిమా సంపాదించుకున్న రేటింగ్ ఇది. బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్ లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ కంటే దారుణమైన రేటింగ్ ని లైగర్ సంపాదించుకుంది. మరి దీనిపై పూరి అండ్ కో ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.