రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్ లో పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ బాక్సాఫీస్ టార్గెట్ గా ఈ మూవీని పూరి ఆవిష్కరించాడు. ఇప్పటి వరకు ఇండియానైజ్డ్ ఎలిమెంట్స్ తో ఉండే పూరి సినిమాలలో లైగర్ మొదటి సారి హాలీవుడ్ స్టాండర్డ్, అమెరికన్ స్ట్రీట్ కల్చర్ లుక్స్ తో ఈ సినిమాని ఆవిష్కరించారు. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. దీంతో పబ్లిక్ టాక్ తో ట్విట్టర్ లో సినిమా రివ్యూ ట్రెండ్ మొదలైంది.
మూడేళ్ళ గ్యాప్ తర్వాత పూరి జగన్నాథ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై మాస్ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపధ్యంలో సినిమా ఫస్ట్ రివ్యూ రానే వచ్చింది. ఇక పబ్లిక్ టాక్ బట్టి సినిమా ఫస్ట్ హాఫ్ మదర్ సెంటిమెంట్ తో పాటు, విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్స్ తో, ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో నడిచింది. ఇక సెకండ్ ఆఫ్ కూడా ముంబై బ్యాక్ డ్రాప్ లో నడుస్తూ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఆధ్యంతం ఆడియన్స్ ని కట్టిపడేసే విధంగా ఉంది. పూరి ఎప్పటిలాగే రొటీన్ కథనే తీసుకొని తనదైన స్టైల్ లో అద్భుతమైన స్క్రీన్ ప్లే తో తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తుంది.
ఇక సినిమాకి క్లైమాక్స్ ప్రాణం పోసిందని, ఎవరూ ఊహించని స్థాయిలో సరికొత్తగా క్లైమాక్స్ ని పూరి జగన్నాథ్ డిజైన్ చేసాడని ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన. ఇక సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బాంబ్స్ వచ్చేలా ఉన్నాయని ఆడియన్స్ చాలా ఎగ్జైటింగ్ గా చెబుతూ ఉండటం విశేషం. ఏకంగా 6 ఫైటింగ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇక విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో హోల్ అండ్ సోల్ గా సినిమాని నడిపించి మెప్పించాడని తెలుస్తుంది. ఇక ఓవరాల్ గా పూరి జగన్నాథ్ తనకి అలవాటైన రొటీన్ యాక్షన్, మాఫియా బ్యాక్ డ్రాప్ తీసుకున్న మార్షల్ఆర్ట్స్ ఫైటింగ్స్ జోడించి, సరికొత్త కథనంగా ఆవిష్కరించి సక్సెస్ అయ్యాడని టాక్ వినిపిస్తుంది.