విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఏ రేంజ్ లో డిజాస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో బయ్యర్లు ఈ సినిమా మీద పెట్టుబడి పెట్టి నిలువునా మునిగిపోయారు. డిస్టిబ్యూటర్స్ కి భారీ నష్టాలని ఈ సినిమా మిగిల్చిన సంగతి తెలిసిందే. మూడు రోజులకే థియేటర్స్ ఖాళీ అయిపోయాయి. ఇక ఈ సినిమా ఇచ్చిన షాక్ తో పూరి జగన్నాథ్ ఇప్పటికి కోలుకోలేదు. ఇక విజయ్ తో ప్లాన్ చేసిన జనగణమన సినిమా కూడా ఆగిపోయింది.
అయితే ఇంత ఘోరమైన రిజల్ట్ ఇచ్చిన లైగర్ మూవీ హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యిందనే విషయం చాలా మందికి తెలియదు. హిందీలో ప్రభాస్ రాధేశ్యామ్ కంటే ఎక్కువ కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకోవడం విశేషం. బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ 2తో సమానంగా లైగర్ సినిమాకి హిందీలో కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా హిందీ రిలీజ్ రైట్స్ ని 9 కోట్లకి కొనుగోలు చేశారు. ఇక సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ చూసుకుంటే ఏకంగా 25 కోట్ల షేర్ మూవీకి వచ్చినట్లు తెలుస్తుంది.
ఈ లెక్కన చూసుకుంటే నిర్మాతకి పెట్టిన పెట్టుబడికి రెండు రేట్లు అధికంగా లైగర్ లాభాలు తెచ్చిపెట్టింది. దీనిని బట్టి విజయ్ దేవరకొండకి నార్త్ ఇండియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే హిందీలో కూడా ఈ మూవీకి ఫ్లాప్ టాకే వచ్చింది. అయినా కూడా సినిమాకి కలెక్షన్స్ ఈ స్థాయిలో వచ్చాయంటే అది విజయ్ దేవరకొండ క్రేజ్ కారణంగానే అనే టాక్ వినిపిస్తుంది. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా డిస్టిబ్యూటర్స్ కి పూరి జగన్నాథ్ నష్టాలని సెటిల్ చేసే పనిలో పడ్డాడని తెలుస్తుంది. ఈ నెల ఆఖరు లోపు మొత్తం సెటిల్ చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.