విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక రమ్యకృష్ణ కీలక పాత్రలో విజయ్ దేవరకొండకి తల్లిగా నటిస్తుంది. ఇక ఈ మూవీలో మరో విశేషం ప్రపంచ మేటి బాక్సర్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటించడం. మొదటి సారి ఇండియన్ స్క్రీన్ పై అతను కనిపించబోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ లో కూడా మైక్ టైసన్ కనిపించి అలరించాడు. ఇక ఈ టీజర్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఊహించని స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది.
ఏకంగా 60 మిలియన్ వ్యూస్ ని ఈ టీజర్ సొంతం చేసుకొని స్టార్ హీరోల రేంజ్ లో క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ టీజర్ తర్వాత బాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. గత మూడు రోజులుగా డిజిటల్ మీడియాలో లైగర్ టీజర్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇక సినిమాపై కూడా ఈ టీజర్ మంచి హైప్ క్రియేట్ అయ్యింది. చాలా కాలం తర్వాత పూరి జగన్నాథ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అది కూడా పాన్ ఇండియాలో వస్తున్న మూవీ కావడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది.
దీనికి తగ్గట్లుగానే తాజాగా ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ని ఎవరూ ఊహించని రేటుకి అమ్ముడుపోయాయి. ప్రముఖ సంస్థ అయిన స్టార్ గ్రూప్ ఈ మూవీ హక్కులని ఏకంగా 55 కోట్లకి కొనుగోలు చేసింది. ఓ విధంగా చెప్పాలంటే పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కెరియర్ లో అత్యధిక ధరకి డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన చిత్రంగా లైగర్ రికార్డు క్రియేట్ చేసింది. పూరి కనెక్ట్స, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుంది. ఛార్మి, కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా 5 బాషలలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మరి ఏ స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకులని మెప్పిస్తుంది అనేది వేచి చూడాలి.