రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య ఈ సినిమాని చిత్ర యూనిట్ రిలీజ్ కి రెడీ చేసింది. గత 15 రోజులుగా విజయ్ దేవరకొండ అండ్ పూరి టీమ్ సినిమా ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలని చుట్టేసి గట్టిగా ప్రమోషన్ చేశారు. బాక్సింగ్ నేపధ్యంలో, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మదర్ సెంటిమెంట్ బేస్ చేసుకొని ఉంటుందని ఇప్పటికే ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమాని పూరి గత హిట్ ఓవై అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో పోల్చి చూస్తున్నారు.
అయితే హాలీవుడ్ స్టాండర్డ్స్ లో హై ఓల్టేజ్ మూవీగా దీనిని పూరి ఆవిష్కరించిన విధానం ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ లో కనిపించింది. ఈ నేపధ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వరల్డ్ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం కూడా సినిమా రేంజ్ ని పెంచింది. ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ కి రెడీ అయినా లైగర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసింది. యూఎస్ ప్రీమియర్ షోకి గాను ఏకంగా 200కే డాలర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సంపాదించిన మొదటి చిత్రంగా లైగర్ నిలిచింది.
ఇక ఇండియన్ వైడ్ గా కూడా భారీ స్థాయిలోనే బుకింగ్స్ జరిగాయి. తెలుగు బాక్సాఫీస్ దగ్గర 84 లక్షలు బుకింగ్ ద్వారా ఈ సినిమా సంపాదించింది. విజయ్ దేవరకొండ కెరియర్ లోనె భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడం, పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతూ ఉండటంతో పాటు ఇప్పటికే పాజిటివ్ బుజ్ నడుస్తూ ఉండటంతో టాలీవుడ్ నుంచి మరో కలెక్షన్స్ సునామీ ఈ సినిమాతో సాధ్యం అవుతుందని అందరూ భావిస్తున్నారు. మరి ఆ అంచనాలని పూరి అండ్ కో ఎంత వరకు అందుకుంటారు అనేది చూడాలి.