Lemon leaves: నిమ్మకాయ మన నిత్య జీవితంలో భాగమైందంటే అతిశయోక్తి కాదు. ఆరోగ్యానికి దివ్యౌషధంగా ఇది పని చేస్తుంది. అలాగే నిమ్మ ఆకులతో కూడా బోలెడు లాభాలున్నాయని మీకు తెలుసా? రోజూ నిమ్మరసం కలిపిన గోరు వెచ్చని నీరు తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే నిమ్మ ఆకులను తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే. నిమ్మ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ బి1, వివిధ రకాల ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, ప్లేవనాయిడ్స్, రైబోఫ్లోవిన్ సహా అనేక పోషక విలువలన్నాయి.
నిమ్మ ఆకులు వాసన చూస్తే చాలా రకాల ప్రయోజనాలు కూడాఉన్నాయి. వీటిలో యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటెల్మింటిక్, యాంటీ ఫ్లాట్యులెంట్, యాంటీ మైక్రోబయల్, యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా దొరుకుతాయి. ఈ విషయాలు అనేక అధ్యయనాల్లో సైతం నిరూపితమయ్యాయి. ఇటీవల ఎన్సీబీఐలో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం, నిమ్మ ఆకుల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్లు లేకుండా, పెరగకుండా నిరోధిస్తుందని వెల్లడైంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న ప్రతి ఒక్కరికీ నిమ్మ ఆకు దివ్యౌషధంగా పని చేస్తుంది.
అలాగే మనలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. తలనొప్పిలో కూడా అనేక రకాలున్నాయి. ఎక్కువ సేపు కంప్యూటర్ పై పని చేసే వారికి తలనొప్పి వస్తుంటుంది. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు నిమ్మ ఆకులు వాసన చూస్తే తక్షణం రిలీఫ్ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Lemon leaves:
నిద్ర పట్టకపోవడం, చికాకుగా ఉండటం లాంటి సమస్యలకూ నిమ్మ ఆకు వాసన చూడటం బెస్ట్ టిప్ అంటున్నారు. బరువు తగ్గడానికి కూడా నిమ్మ ఆకులు, నిమ్మ కాయలు వాడవచ్చు. నీటిలో నిమ్మ ఆకులు వేసి మరిగించి టీ తయారు చేసుకొని తాగొచ్చు. స్నానం చేసేటప్పుడు కూడా వేడి నీటిలో కాసిన్ని నిమ్మ ఆకులు వేసి స్నానం చేస్తే చర్మ సమస్యలూ తగ్గుతాయి.