KTR: మై విలేజ్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గంగవ్వ ఈ వయసులో టెక్నాలజీని ఉపయోగించుకొని తనకంటూ సొంత యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారు.ఇక ఈమె యూట్యూబ్ వీడియోల ద్వారా మాత్రమే కాకుండా సినిమాలలో కూడా నటించే అవకాశాలను అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా గంగవ్వ తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశిస్తూ మహేష్ బాబులా ఉన్నావ్ అంటూ అతనిపై పొగడ్తలు కురిపించారు. ఈ క్రమంలోనే ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కరీంనగర్ లో గత ఆరు రోజుల నుంచి కళోత్సవాలు పేరిట బారి ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమం చివరి రోజు ఆదివారం ఎంతో ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొని సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులను ఇలా నేరుగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ మాట్లాడారు.
ఈ క్రమంలోనే మై విలేజ్ షో గంగవ్వను దగ్గరికి తీసుకొని గంగవ్వ ఈ వయసులో కూడా ఎంతో కష్టపడుతూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచుతుంది అంటూ కామెంట్ చేశారు. ఇకపోతే ఇందాకనన్ను పట్టుకొని మహేష్ బాబు లా ఉన్నావ్ అంటూ కామెంట్ చేశావు. ఇలా నన్ను మహేష్ బాబుతో పోల్చడం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఆయన వింటే చాలా ఫీల్ అవుతారు అంటూ సరదాగా మాట్లాడారు.
KTR: మై విలేజ్ షోలో కనిపిస్తానని మాట ఇచ్చిన కేటీఆర్..
ఇకపోతే నువ్వు నన్ను పట్టుకొని మహేష్ బాబు అన్నావంటే నీ కళ్ళలో ఏదో సమస్య ఉంది చూపించుకో అంటూ తనదైన శైలిలో గంగవ్వకు కేటీఆర్ కౌంటర్ వేశారు. మొత్తానికి కేటీఆర్ గంగవ్వ మధ్య జరిగిన ఈ సంభాషణ అక్కడున్న వారందరికీ సరదాగా నవ్వు తెప్పించింది. అదేవిధంగా కేటీఆర్ గంగవ్వతో మాట్లాడుతూ తప్పకుండా నేను మీ మై విలేజ్ షోలో కనిపిస్తానని నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలను మై విలేజ్ ద్వారా చెప్పడమే కాకుండా తెలియని విషయాలను కూడా తెలుసుకుంటారని ఈ సందర్భంగా కేటీఆర్ గంగవ్వకు హామీ ఇచ్చారు.