KTR: తెలంగాణలో మునుగోడు ఎన్నికల వేడి రసవత్తరంగా సాగుతోంది. ఓ వైపు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈసారి ఎలాగైనా ఉప ఎన్నికల్లో గెలవాలనే సంకల్పంతో వ్యూహ రచనలు చేస్తూ మందుకు సాగుతోంది. మరోవైపు ఈసారి కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడించి తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలనే ప్రతి వ్యూహాలతో భారతీయ జనతా పార్టీ సిద్దం అవుతూ అడుగులు వేస్తోంది.
వీరికి తోడు తెలంగాణ ప్రజలకు రాష్ట్రాన్ని ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు భిన్నంగా ఉనికి చాటుకునేందుకు ప్రయత్నం చేస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం బీజేపీ తరపున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన విషయం అందరికీ తెలిసిందే..! తన వ్యక్తిగత రాజకీయ కారణాల చేత కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పై పోరాటం చేసేందుకు బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీకి సిద్దం అయ్యారు.

ప్రస్తుతం మునుగోడులో గత ఉప ఎన్నికల మాదిరిగానే త్రిముఖ పోటీ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ” మునుగోడులో జరిగే ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ..? ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్ ఫ్లోరోసిస్ నిర్ములనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ… ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన తెరాస కేసిఆర్ పార్టీలోకి చేరనున్న ఆ ఇద్దరు ఏపీ సీనియర్ నాయకులు..!?” అంటూ ట్వీట్ చేశారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఒకే అంశానికి సంబంధించి కాంగ్రెస్, బీజేపీలను బాధ్యలను చేస్తూ కేటిఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు గత ఎన్నికల్లో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారా… గత ఉప ఎన్నికల మాదిరిగా మునుగోడు ప్రజలు కూడా బీజేపీకి బూస్ట్ ఇస్తారా…. కేటిఆర్ అన్నట్లు శాపవిముక్తి చేసిన టిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారా చూడాలి మరి..!