Bigg Boss 6: బిగ్ బాస్ రియాల్టీ షో కి తిరుగులేని క్రేజ్ ఉన్న సమస్య తెలిసిందే. సీజన్ రన్ అవుతున్న సమయంలో అదే సమయంలో ఇండస్ట్రీలో విడుదలయ్యే సినిమాకి సంబంధించిన… హీరో మరియు హీరోయిన్ ఇంకా దర్శకులు హౌస్ లో అడిగి పెడుతూ ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు. గతంలో ఈ తరహా లోనే పలు సినిమా యూనిట్ లు.. ప్రమోషన్స్ కోసం తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం జరిగింది. సీజన్ ఫైవ్ లో నాని, రష్మిక మందన, సాయి పల్లవి, కృతి శెట్టి, ఆలియా భట్, రామ్ చరణ్, రాజమౌళి రావడం తెలిసిందే.

అయితే ఇప్పుడు సీజన్ సిక్స్ లో సుదీర్ బాబు, కృతి శెట్టి అడుగుపెట్టనున్నారట. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు, కృతి శెట్టి నటించిన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో.. సినిమా ప్రమోషన్స్ ఈ రకంగా ప్లాన్ చేయటం జరిగింది అంట. ఈ సందర్భంగా ఇంటి సభ్యులతో సుధీర్ బాబు ఇంకా కృతి శెట్టి సందడి చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హౌస్ లో రెండోవారం కెప్టెన్ గురించి రకరకాల టాస్కులు జరుగుతున్నాయి. కెప్టెన్సీ బరిలో చంటి, సుల్తానా, సూర్య, రాజ్ ఉండటం జరిగింది. మరి వీరిలో కెప్టెన్ ఎవరు అవుతారో చూడలి.
ఇక ఇదే సమయంలో రెండో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వటానికి ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. ఎనిమిది మంది నామినేషన్ లో రాజ్ ఒకరు. అయితే మనోడు కెప్టెన్సీ రేస్ లో మంచి దూకుడు మీద ఉన్నారు. రాజ్ కెప్టెన్ అయితే.. చాలావరకు ఎలిమినేషన్ విషయంలో సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.