Kriti Sanon : సినిమాల్లో తమ నటనతో, గ్లామర్ షో తో మెప్పించడంలో మాత్రమే కాదు ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా సినిమాకు ప్రచారం చేయడం ప్రేక్షకులను సినిమా వచ్చేలా చేయడంలోనూ హీరోయిన్లు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ప్రమోషన్లలో డాన్సులతో క్రేజీ మూమెంట్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తూ మూవీకి హైప్ తీసుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ త్వరలో రిలీజ్ కాబోయే తన హిందీ మూవీ భేడియా కోసం ఓ రేంజ్ లో ప్రచారం చేస్తుంది. దేశాలు దాటి మరి విదేశాల్లోనూ మూవీ ప్రమోషన్ చేసేస్తోంది. కృతి సనన్ లేటెస్ట్ గా దుబాయ్, హైదరాబాద్‌లలో వరుణ్ ధావన్‌తో కలిసి భేదియాను ప్రమోట్ చేసింది. ఈ ప్రమోషన్ ఈవెంట్లో అద్భుతమైన అవుట్ ఫిట్స్ ను ధరించి యూత్ మనసును దోచేసింది.

Kriti Sanon : ఓవైపు సినిమా షూటింగులు మరోవైపు మూవీ ప్రమోషన్స్ తో పాటు వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది కృతి. ఇంతటి బిజీ షెడ్యూలు ఉన్నా ఇన్ స్టాలో మాత్రం తన పిక్స్ nu పోస్ట్ చేయకుండా ఉండలేకపోతోంది. తాజాగా దుబాయ్ లో ప్రమోషన్ ఈవెంట్ కోసం వేసుకున్న కాపర్ కలర్ గౌన్ పిక్స్ తో పాటు, హైదరాబాదులో జరిగిన ఈవెంట్ కోసం వేసుకున్న వైట్ కలర్ అవుట్ ఫిట్ కు సంబంధించిన పిక్స్ ని ఇన్ స్టాల్ లో పోస్ట్ చేసింది కృతి. ఈ రెండు అద్భుతమైన అవుట్ ఫిట్ లోనూ కృతి ఎంతో హాట్ గా కనిపించి కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.

దుబాయ్ ఈవెంట్ కోసం వేసుకున్న కాపర్ గౌనును క్లోతింగ్ లేబుల్ అలమోర్ షెల్ఫ్‌ల నుండి సేకరించింది. ఈ అవుట్ ఫిట్ తో వెడ్డింగ్ ఫ్యాషన్ ను ప్రమోట్ చేస్తోంది కృతి. వెడ్డింగ్ కాక్ టెయిల్ పార్టీస్ కి, ఎంగేజ్మెంట్స్ కి పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ గా భావిస్తున్నారు ఫ్యాషన్ ప్రియులు.

స్వీట్‌హార్ట్ నెక్‌లైన్, డ్రెప్డ్ డిటెయిల్స్ , రిస్కీ థై హై స్లిట్ తో స్ట్రాప్స్ తో వచ్చిన ఈ బాడీ కా డ్రెస్ కృతి ఫిగర్ ను పర్ఫెక్ట్ గా చూపిస్తోంది. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా ఆమె స్ట్రాపీ హైహీల్స్, స్టేట్‌మెంట్ రింగ్‌లు, గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ధరించింది ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందించింది.

ఇక హైదరాబాద్ ఈవెంట్ కోసం క్లాసిక్ షీర్ ఎంబ్రాయిడరీ చీరను ధరించింది. జైనాబ్ సల్మాన్ క్లాతింగ్ లేబర్ నుంచి ఈ చీరను ఎంపిక చేసింది కృతి. ఫ్లోరల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ, అప్లిక్ వర్క్‌తో డిజైన్ చేసిన సీ-త్రూ షిఫాన్ చీరను కట్టుకుని ఫాన్స్ ను ఫిదా చేసింది. ఫ్రంట్ ప్లీట్స్మరియు, పల్లుపై రఫ్డ్ డిజైన్‌లు చీరకు సరికొత్తందాన్ని తీసుకొచ్చాయి. డీప్ నెక్‌లైన్‌తో డిజైన్ చేసిన స్ట్రాపీ బ్యాక్‌లెస్ బ్లౌజ్ ను చీరకు మ్యాచింగ్ గా ధరించి మంత్రముగ్ధులను చేసింది.
