Kriti Sanon : వీకెండ్ వస్తే చాలు బాలీవుడ్ ముద్దుగుమ్మలు ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంటారు. స్టార్ హీరోయిన్ల దగ్గరి నుంచి యువ హీరోయిన్ల వరకు అదిరిపోయే లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేస్తుంటారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా బ్లాక్ అవుట్ ఫిట్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి.

Kriti Sanon : కృతి సనన్ ఎప్పుడూ డల్ ఫ్యాషన్ ను ఎంపిక చేయలేదు. ఈ బ్యూటీ ఎప్పుడూ బ్రైట్ కలర్స్ తోటే అందరి చూపులు తన వైపుకు తిప్పుకునేలా చేస్తుంది. తాజాగా కృతి తన మూవీ భేదియా ప్రమోషన్స్ కోసం అదిరిపోయే అవుట్ ఫిట్ ను వేసుకుని అందరిని విస్మయానికి గురిచేసింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా బ్లాక్ అవుట్ ఫిట్ తో మ్యాజిక్ చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

బాడీ కాన్ ఫిట్టింగ్, డీప్ నెక్ లైన్ తో వచ్చిన స్ట్రాపీ డీటైల్స్ కలిగిన బ్లాక్ డ్రెస్ కృతికి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఈ అవుట్ ఫిట్ కు జోడిగా మ్యాచింగ్ బ్లాక్ హీల్స్ వేసుకొని స్టైలిష్ లుక్ లో అదరగొట్టింది. చెవులకు గోల్డెన్ హూప్ రింగ్స్, చేతి వేళ్లకు బంగారు ఉంగరాలను పెట్టుకుని కైపెక్కించే చూపులతో హాట్ ఫోటోషూట్ చేసి కుర్రకారు మైండ్ బ్లాక్ చేస్తోంది. మినిమల్ మేకప్ తో పెదాలకు గ్లాసీ లిఫ్ స్టిక్ పెట్టుకొని మెస్మరైజ్ చేసింది.

కృతి సనన్ వార్డ్ రోబ్ నిండా చిక్ డ్రెస్సెస్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ మధ్యనే పసుపు రంగు డ్రెస్సు వేసుకొని ఊపిరి సలపకుండా చేసింది. ఈ మినీ ఎల్లో డ్రెస్ ను క్లాటింగ్ బ్రాండ్ అలెగ్జాండర్ వాతియర్ నుంచి ఎన్నుకుంది. ఫుల్ స్లీవ్స్, నెక్ లైన్ దగ్గర వచ్చిన కటౌట్ పాటర్న్ ఈ డ్రెస్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

కృతి సనన్ దుస్తులతో ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. ఇటీవలే అద్భుతమైన ఎలక్ట్రిక్ బ్లూ మినీ డ్రెస్ ను వేసుకుని మెరిసిపోయింది. లెఫోర్డ్ ప్రింట్స్ తో వచ్చిన ఈ డ్రెస్ లో లేడీస్ చిరుతలా కనిపించింది కృతి. డ్రెస్ కు తగ్గట్లుగా కనులకు హెవీ ఐ మేకప్, బ్లూ కాజల్ పెట్టుకుని బోల్డ్ లుక్ తో మైండ్ బ్లాక్ చేసింది.

వీకెండ్ పార్టీలకైతే ఈ అమ్మడు ధరించే అవుట్ ఫిట్స్ ట్రెండ్ సెట్ చేస్తాయనడంలో సందేహమే లేదు. మెరూన్ కలర్ మినీ డ్రెస్ లో అందరి చూపులు తన వైపు తిప్పుకుంది. ప్లంగింగ్ నెక్ లైక్ , టై నాట్ డీటైయిల్స్ తో వచ్చిన ఈ అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపించింది కృతి.

