Kriti Sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మంచి జోరు మీద ఉంది. గత కొంతకాలంగా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్స్ తో ఈ భామ అందరిని మంత్రముగ్ధులను చేస్తుంది. త్వరలోవి రిలీజ్ కాబోతున్న తన సినిమా భేడియా ప్రమోషన్స్ తో పాటు ఫ్యాషన్లు ప్రజెంట్ చేస్తూ ఈ భామ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరోవైపు తాజాగా జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో అదిరిపోయే డ్రెస్ వేసుకుని అందరి చూపు తన వైపు తిప్పుకుంది. డార్క్ కలర్ లో ఉన్న అవుట్ ఫిట్ లో అమ్మడి అందాలు మరింత ఆకర్షణీయంగా కనిపించాయి.

Kriti Sanon : ఎల్లీ బ్యూటీ అవార్డ్స్ ఫంక్షన్ లో ఇరగదీసింది కృతి సనన్. డార్క్ బ్లూ కలర్ లో డిజైన్ చేసిన అందమైన అవుట్ ఫిట్ ను ధరించి అదరగొట్టింది. కటౌట్ డీటెయిల్స్ తో వచ్చిన లాంగ్ ఫ్రాక్ లో కత్తిలా మెరిసిపోయింది. ఎద అందాలను మాత్రమే కవర్ చేసే విధంగా ఈ అవుట్ ఫిట్ ను డిజైన్ చేశారు డిజైనర్. గత కొంతకాలంగా విభిన్న దుస్తులను ధరించి మంత్రముగ్ధులను చేస్తున్న కృతి ఈ అవుట్ ఫిట్ తో సరికొత్త ఫ్యాషన్ కు తెరలేపింది. థై హై వరకు వచ్చిన కటౌట్స్ తొడ అందాలను ఎలివేట్ చేస్తున్నాయి. ఈ సరికొత్త అవతార్ లో కృతి ఎంతో హాట్ గా కనిపించింది. కుర్రాళ్లకు కులుకు లేకుండా చేసింది.

అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా జ్యువెలరీని సెట్ చేసింది. చెవులకు మెరిసేటి డైమండ్ ఇయర్ రింగ్స్ ని పెట్టుకుంది. చేతులకు డైమండ్ బ్రేస్లెట్, చేతివేళ్ళకు డైమండ్ ఉంగరాలను అలంకరించుకుంది. కనులకు వింగెడ్ ఐ లైనర్, మస్కరా, వేసుకుని ఐబ్రోస్ ను డార్క్ చేసింది. కత్తిలాంటి లుక్స్ తో కుర్రాళ్లకు కిక్ ఇచ్చింది.

ఈ అవుట్ ఫిట్ గ్యావిన్ మిగ్యువెల్ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ నుంచి ఎన్నుకుంది. పాదాలకు వేసుకున్న హిల్స్ లౌబౌటిన్ న్ నుంచి సెలెక్ట్ చేసింది. డైమండ్ జ్యువలరీ ని కరిష్మా జ్యు వెలరీ నుంచి ఎన్నుకుంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ కృతికి అందమైన లుక్స్ ను అందించింది.