Kriti Sanon : కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్‌లోని ప్రముఖ హీరోయిన్ లలో ఒకరు. త్వరలో వరుణ్ ధావన్‌తో కలిసి భేదియా సినిమాలో కనిపించి అలరించనుంది . అందం , అందానికి తగిన నటనతో ఈ గ్లామరస్ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగింది ఈ బ్యూటీ. అంతేకాదు ఫ్యాషన్ , స్టైలింగ్ విషయంలో కూడా హై స్టాండర్డ్స్ ను ఫాలో అవుతోంది.

Kriti Sanon : కృతి సనన్ తన లేటెస్ట్ లుక్‌తో ఫ్యాషన్ లక్ష్యాలను నిర్దేశిస్తోంది. బ్లాక్ కటౌట్ బాడీకాన్ డ్రెస్‌లో అద్భుతమైన ఫోటో షూట్ చేసి మంత్రముగ్ధులను చేస్తోంది.

లేటెస్ట్ ట్రెండ్స్ ను ఫాలో అవ్వడం లో ఈ భామ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే అవుట్ ఫిట్స్ ను ఎన్నుకుంటుంది. కృతి సనన్ ధరించే ప్రతి అవుట్ ఫిట్ ఉల్లాసంగా , ఫెమినైన్ గా ఉంటాయని తన కట్ అవుట్ డ్రెస్ తో మరో సారి నిరూపించింది ఈ చిన్నది . పార్టీ లుక్స్‌లో తానే రాణి అన్నట్లుగా కనిపిస్తోంది ఈ భేదియా నటి . మోనోటోన్ దుస్తులతో మ్యాజిక్ చేస్తోంది. కటౌట్ వివరాలతో వచ్చిన ఈ అద్భుతమైన బాడీ కాన్ డ్రెస్ లో హాట్ ఫోటో షూట్ చేసి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.

నమ్మినా , నమ్మకపోయినా, బ్లాక్ బాడీకాన్ దుస్తులు ప్రతి ఒక్కరూ తమ వార్డ్‌రోబ్‌లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన ఆకర్షణీయమైన యూనిఫాం. కాక్‌టెయిల్ ఈవెనింగ్‌ల కోసం ఈ క్లాసిక్ బ్లాక్ డ్రెస్‌ని తప్పక చేర్చుకోవాలంతో ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది . ఈ క్లాసిక్ బాడీ-హగ్గింగ్ అవుట్ ఫిట్ కృతి నాజూకు శరీరాన్ని స్పష్టంగా ప్రదర్శించింది.

పొడవాటి చేతులతో ,ఆకర్షణీయమైన ఫ్రంట్ కట్-అవుట్ వివరాలు, వెనుక భాగంలో ఒక బటన్ కాలర్ హాల్టర్ నెక్ తో వచ్చిన ఈ అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపించి కుర్రాళ్ళమతులు పోగోటింది.

రీసెంట్ గా కృతి స్వీట్-హార్ట్ నెక్‌లైన్‌తో డిజైన్ చేసిన బ్లాక్ ట్యూబ్-డ్రెస్‌లో అందంగా కనిపించి అందరిని ఫిదా చేసింది. తోడవరకు వచ్చిన హై స్లిట్ అవుట్కు ఫిట్ లో తన గ్లామరస్ లుక్స్ ను ప్రదర్శించింది. ఈ డ్రెస్ కు తగ్గట్లుగా పెద్ద నల్లటి బూట్లను పాదాలకు వేసుకుని ఆమె రూపాన్ని పూర్తి చేసింది.
