Kriti Sanon : కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్‌లోని ప్రముఖ హీరోయిన్ లలో ఒకరు. త్వరలో వరుణ్ ధావన్‌తో కలిసి భేదియా సినిమాలో కనిపించి అలరించనుంది . అందం , అందానికి తగిన నటనతో ఈ గ్లామరస్ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగింది ఈ బ్యూటీ. అంతేకాదు ఫ్యాషన్ , స్టైలింగ్ విషయంలో కూడా హై స్టాండర్డ్స్ ను ఫాలో అవుతోంది.

Kriti Sanon : కృతి సనన్ తన లేటెస్ట్ లుక్‌తో ఫ్యాషన్ లక్ష్యాలను నిర్దేశిస్తోంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో వచ్చిన కో ఆర్డ్ సెట్‌లో అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ అవుట్‌ఫిట్‌లోనే హాట్ ఫోటో షూట్ చేసి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

లేటెస్ట్ ట్రెండ్స్ ను ఫాలో అవ్వడం లో కృతి సనన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే అవుట్ ఫిట్స్ ను ఎన్నుకుంటుంది. కృతి సనన్ ధరించే ప్రతి అవుట్ ఫిట్ ఉల్లాసంగా , ఫెమినైన్ గా ఉంటాయని తన కో ఆర్డ్ సెట్‌ను చూసి చెప్పక తప్పదు. భేడియా సినిమా ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ వీలు కుదుర్చుకుని మరీ తన ఇన్‌స్టాఫ్యాన్స్‌ను అలరించేందుకు ఈ హాట్ పిక్స్‌ను షేర్ చేసింది.

వైట్ అండ్ బ్లాక్ కలర్స్‌లో హారిజాంటల్ లైన్స్‌తో వచ్చిన థిన్ స్ట్రిప్డ్ బ్రాలెట్ వేసుకుని దాని మీదుగా లూజ్ షర్ట్ ను వేసుకుని బటన్స్‌ను విప్పేసింది. ఈ బ్రాలెట్ , షర్ట్ కు మ్యాచింగ్‌గా అదే ప్యాట్రన్స్‌తో కలర్స్ తో వచ్చిన మినీ టైట్ ఫిట్ స్కర్ట్ ను ధరించింది ఈ బ్యూటీ. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగ సింపుల్ మేకప్ వేసుకుని తన కురులను మధ్యపాపిట తీసుకుని లూజ్‌గా వదులుకుంది ఈ హాటీ. ఈ కో ఆర్డ్ సెట్‌లో నిజంగా కృతి ససన్ తన గ్లామరస్ లుక్‌ను మరోసారి ఫ్యాన్స్‌కు పరిచయం చేసింది. కృతి థైస్ అందాలను చూసి తన్మయంలో మునిగిపోయారు అభిమానులు.

తన మూవీ ప్రమోషన్‌లో భాగంగా కృతి సనన్ తన పాఠశాలను చానాళ్ల తరువాత సందర్శించింది చాలా థ్రిల్ ఫీల్ అయ్యింది. డీపీఎస్ ఆర్కే పురం గేట్ బయట నిలబడి ఓ ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది కృతి. మళ్లీ పాఠశాలకు 15 ఏళ్ల తరువాత భేడియా చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి వచ్చానని చాలా గర్వంగా ఉందని తన ఫీలింగ్స్‌ను పంచుకుంది. ఈ పోస్ట్‌కి కృతి సోదరి నుపుర్ సనన్ ఫైర్ ఎమోజీలను రిప్లైగా గా ఇచ్చింది. ఈ పిక్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
