Kriti Sanon : కృతి సనన్ న్యాచురల్ బ్యూటీ. తన స్టైలిష్ లుక్స్ తో ఎప్పుడు అందరికీ ఫాషన్ స్టేట్మెంట్స్ అందిస్తూ ఉంటుంది కృతి . ఎప్పుడైనా ఏదైనా అవుట్ ఫిట్ ఎన్నుకోవడంలో గందరగోళంగా అనిపించినప్పుడల్లా కృతిని ఫాలో అయితే సరిపోతుంది అని భావిస్తారు ఫ్యాషన్ ప్రియులు. అకేషన్ కు తగ్గట్లుగా ఫ్యాషన్ ని ఎన్నుకోవడంలో ఈ బ్యూటీ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉంటుంది. లేటెస్ట్ గా కృతి డిస్కో వైబ్స్ ను తీసుకొచ్చే విధంగా స్టన్నింగ్ అవుట్ ఫిట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Kriti Sanon : ఓ ఫోటో షూట్ కోసం సిల్వర్ కలర్ మెటాలిక్ మినీ డ్రెస్ వేసుకుని మంత్రముగ్ధులను చేసింది. ఫిగర్ హగ్గింగ్ డీటెయిల్స్ తో వచ్చిన స్లీవ్ లెస్ అవుట్ ఫిట్లో వేసుకొని కుర్రాళ్ళ గుండెల్లో హీట్ పెంచింది. ఈ పొట్టి డ్రెస్ కు మ్యాచింగ్ గా సిల్వర్ జాకెట్ టాప్ ధరించింది. మెడలో సిల్వర్ చైన్ చెవులకు హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని సింపుల్ మేకప్ తో గ్లామర్ లుక్స్ తో యూత్ అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకుంది.

ఈ హాట్ ఫోటోషూట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది బ్యూటీ.ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. యూత్ క్రేజీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఈ ట్రెండీ అవుట్ ఫిట్ ను కనిక గోయల్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది కృతి. ఆక్వామెరైన్ జ్యువెలరీ నుంచి ఆభరణాలను ఎన్నుకుంది. సోఫియా వెబ్ స్టర్ నుంచి స్ట్రాపీ హీల్స్ ను సేకరించింది. సెలబ్రిటీ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ కృతికి స్టైలిష్ లుక్స్ ని అందించింది.

రీసెంట్ గా చేసిన మరో ఫోటోషూట్ లో కలర్ ఫుల్ డ్రెస్ లో కత్తిలా కనిపించింది కృతి. డిజైనర్స్ గౌరీ నైనిక రూపొందించిన మిడి డ్రెస్ ను ధరించి పార్టీ ఫ్యాషన్ స్టైల్ స్టేట్మెంట్స్ అందించింది. గులాబీ ప్రింట్లు, ప్లీట్స్, బెలూన్ స్లీవ్స్, డీప్ నెక్ లైన్ కలిగిన గౌను వేసుకుని గ్లామరస్ లుక్స్ తో కవ్వించింది కృతి. నడుము దగ్గర వచ్చిన త్రీడీ అప్లిక్ బ్లాక్ ఫ్లవర్ అందరి దృష్టిని ఆకర్షించింది.

పాదాలకు క్రిస్ క్రాస్ ఫుట్వేర్, చెవులకు డ్రాప్ ఇయర్ రింగ్స్,చేతి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుని పార్టీ వైబ్స్ ను అందించింది.
