Kriti Sanan : ఊబర్ కూల్ చిక్ స్టైల్ వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్ అంటే అందరూ అమితంగా ఇష్టపడతారు ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇవేమీ దేశీయ చీరకట్టుతో పోటీ పడి నిలవలేవు అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. రానున్నది దీపావళి పండుగ కావడంతో బాలీవుడ్ తారలు చీరకట్టుకుని ఎత్నిక్ లుక్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా అద్భుతమైన చీర కట్టుకుని ఫ్యాషన్ ఇన్‌స్పిరేషన్ ఇచ్చేస్తోంది. తెలుపు, బంగారపు వర్ణంలో ఉన్న చీరను సాంప్రదాయంగా కట్టుకుని అందరిని మెస్మరైజ్ చేసింది. ఈ తెల్ల చీర పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అమ్మడి ఎత్నిక్ లుక్స్‌కు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.

Kriti Sanan : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మొహమ్మద్ మజ్‌హర్ షెల్ఫ్ నుంచి రాజ్‌కుమారీ చీరను తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం ఎన్నుకుంది కృతి సనన్. తెల్లటి చీరకు బార్డర్‌లో వచ్చిన బంగారపు పూల డిజైన్స్ కృతి గ్లామర్‌ను మరింతగా పెంచాయి. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చింది కృతి. చీరైతే కట్టుకుంది కానీ బ్లౌజ్ వేసుకోలేదు. వితౌట్ బ్లౌజ్ శారీ కట్టి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపింది. బ్లౌజ్ లేకున్నా కుందనపు బొమ్మలా కనిపిస్తూ తన అందాలను పరిచింది.

ఫ్యాషన్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కృతి పిక్స్‌ను పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌కు ఫాలోవర్స్ క్రేజీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. లైకులు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ చీరకు తగ్గట్లుగా చెవులకు బంగారపు ఇయర్‌రింగ్స్, చేతులకు స్టేట్మెంట్ బ్యాంగిల్స్ , చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకుని అదరగొట్టింది ఈ బ్యూటీ.తన కురులతో మధ్యపాపిట తీసి లూజ్‌గా వదులుకుని సింపుల్ మేకప్‌తో స్టన్నింగ్‌గా కనిపించి కుర్రాళ్లను చంపేసింది.

చీరకట్టుతో చంపేయడం కృతికి కొత్తేమి కాదు గతంలోనూ అద్భుతమైన చీరలను కట్టుకుని కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది. ఓ ఫోటో షూట్ కోసం బంగారపు వర్ణంలో మెరిసిపోతున్న అద్భుతమైన సీక్విన్ చీరను కట్టుకుని తన అందాలను చూపించి యూత్‌ను కవ్వించింది. ఈ చీరకు తగ్గట్లుగా ఫుల్ స్లీవ్స్ సెమీ స్వీట్‌హార్ట్ నెక్‌లైన్‌తో వచ్చిన బ్లౌజ్ ను ధరించి ఎద అందాలను చూపిస్తూ అదరగొట్టింది. ఈ పిక్స్ కూడా ఇంటర్నె్ట్‌లో మంటలు రేపాయి.

గతంలో బచ్చన్ పాండే మూవీ ప్రమోషన్స్ కోసం కృతి కలర్ ఫుల్ ఫ్లోరల్ చీర కట్టుకుని ఫ్యాషన్ ప్రియులకు ఎత్నిక్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది.

మాక్రో ఫ్లోరల్ డీటైల్స్‌తో వచ్చిన రోజీ పింక్ చీర కట్టుకుని డీప్ స్కూప్ నెక్‌లైన్‌తో డిజైన్ చేసిన స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని హాట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది.
