Kriti Sanan : ఆరుగజాల చీరకట్టుతో అందరిని ఇంప్రెస్ చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ, పొడవు కాళ్ల సుందరి కృతి సనన్. రెడ్ కార్పెట్ లుక్స్ నుంచి ఫెస్టివ్ పార్టీస్ వరకు చీరకట్టుతో అందరి చూపును తనవైపు ఎలా తిప్పుకోవాలో ఈ చిన్నదానికి బాగా తెలుసు. తన అందాలను పరిచేలా అందమైన చీరలతో ఇప్పటివరకు ఈ భామ ఎన్నో ఫోటో షూట్‌లు చేసి ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులను చేసింది. తాజాగా తన అప్ కమింగ్ మూవీ ప్రమోషన్స్ కోసం కృతి సనన్ అందమైన చీరను కట్టుకుని అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ ప్రమోషన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంటలు రేపుతున్నాయి. అమ్మడి అందాల గురించే అభిమానులు చర్చించుకుంటున్నారు.

Kriti Sanan : భేడియా సినిమాతో వరుణ్ ధావన్‌తో జోడీ కట్టి కృతి సనన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. త్వరలో విడదుల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌లతో బిజీగా ఉంది కృతి. లేటెస్ట్‌గా ప్రమోషన్ కోసం పింక్ కలర్ చీరను కట్టుకుని కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. తన ఎత్నిక్ శారీకి జోడిగా ట్రెండీ బ్రాలెట్ బ్లౌజ్‌ను వేసుకుని మోడ్రన్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేసింది ఈ చిన్నది. ఈ పింక్ శారీతో చేసిన పోటో షూట్ పిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కృతి సెలబ్రిటీ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్. ఈ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

ఫేమస్ డిజైనర్ హౌస్ ఫాల్గుని షానే పీకాక్ షెల్ఫ్ నుంచి ఈ అందమైన చీరను తన ప్రమోషన్ ఈవెంట్ కోసం ఎన్నుకుంది కృతి. ఈ చీరకు మ్యాచ్ అయ్యేలా ట్రెండీ బ్రాలెట్ బ్రౌజ్ ను వేసుకుంది. ఈ శారీ లుక్‌తో రానున్న పెళ్లి సీజన్‌కు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది ఈ బ్యూటీ. కాక్‌టెయిల్ పార్టీ ఉన్నా, ఎంగేజ్మెంట్ అయినా, రిసెప్షన్ నైట్‌లోనూ ఈ అద్భుతమైన ఉల్లిపొర చీరను కట్టుకుని అందరిని అలరించవచ్చంటోంది ఈ చిన్నది.

సీ త్రూ జరీ ఫ్యాబ్రిక్‌తో ఫ్లమింగో పింక్ షేడ్‌లో వచ్చిన ఈ ఆరుగజాల చీరలో ఎంతో అందంగా కనిపించింది కృతి. శారీకి వచ్చిన సిల్వర్ సీక్విన్స్ మెరుపులు, బీడ్స్, పట్టీ అలంకరణలు, బార్డర్స్, పల్లూ ఎంతో స్పెషల్ గా ఆకట్టుకుంటాయి. ఈ అందమైన చీరకు మ్యాచ్ అయ్యేలా స్వీట్ హార్ట్ నెక్‌లైన్ తో వచ్చిన స్ట్రాపెడ్ బ్రాలెట్ కృతి అందాలను ప్రదర్శించింది.

చెవులకు అందమైన జుంకాలు, చేతికి బంగారు గాజులు వేసుకుని ఈ చిన్నది ఎంతో అట్రాక్టవ్‌గా కనిపించింది. తన కురులతో మధ్య పాపిట తీసుకుని లూజ్‌గా వదులుకుంది. కనులకు స్మోకీ ఐ ష్యాడో, మస్కరా దిద్దుకుంది. పెదాలకు న్యూడ్ లిప్ షేడ్ వేసుకుని తన గ్లామరస్ లుక్స్‌తో యూత్‌ను ఇంప్రెస్ చేసింది.

అంతకు ముందు ఈ చిన్నది బ్లాక్ కలర్ నెట్టెడ్ చీర కట్టుకుని యూత్ మైండ్ బ్లాక్ చేసింది. ఈ చీరకు ట్రెండీ బ్లౌజ్ వేసుకుని ఫ్యాషన్ ప్రియులను ఇంప్రెస్ చేసింది. ఓ ఫోటో షూట్ కోసం వేసుకున్ని ఈ ఎత్నిక్ వేర్ లో అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. స్వీట్ హార్ట్ నెక్‌లైన్ తో వచ్చిన గోల్డెన్ బ్రాలెట్ లో స్పెషల్ గా కనిపించింది కృతి సనన్.
