Kriti Sanan : బాలీవుడ్‌లో అత్యంత అందమైన నటీమణుల్లో కృతి సనన్ ఒకర. సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కృతి సనన్ తన అమేజింగ్ లుక్స్‌తో అందరి చూపును తన వైపు తిప్పుకోవడంలో ఎప్పుడూ ఫెయిల్ కాలేదనే చెప్పాలి. ఈ హీరోపతి నటి ఇటీవలె తన పేరెంట్స్, సిస్టర్ నుపుర్ సనన్ తో కలిసి పారిస్ వెకేషన్ కు వెళ్లింది. పారిస్ వీధుల్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న పిక్స్‌ను, వీడియోలను కృతి సనన్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. పారిస్‌లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలైన ఈఫిల్ టవర్, డిస్నీల్యాండ్‌ను సందర్శించి సందడి చేసింది కృతి సనన్. ఈ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి బోంజోర్ అని ఫోటోలకు క్యాప్షన్‌ను జోడించింది. ఫ్రాన్స్ డెయిరీస్ అని ష్యాష్‌ట్యాగ్‌ను పెట్టింది.

Kriti Sanan : ఈఫిల్ టవర్ దగ్గర బ్లూ కలర్ జంప్ సూట్ వేసుకని కళ్లకు నల్ల కళ్లజోడు పెట్టుకుని స్టైలిష్ లుక్‌లో ఫోటోలు దిగింది కృతి సనన్. ఈఫిల్ టవర్ టాప్ టు బాటమ్ కవర్ చేస్తూ దిగిన ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ పిక్‌తో కృతి తన ఫాలోవర్స్‌కు ఈఫిల్ టవర్ అందాలను చూపిస్తోంది.

పారిస్ లో ఆల్‌టైమ్ అందరి ఫేవరేట్ ప్లేస్ అయిన డిస్నీల్యాండ్‌ను కృతి సనన్ సందర్శించింది. రెడ్ కలర్ షార్ట్ టీషర్ట్ వేసుకుని దానికి మ్యాచింగ్‌గా స్టైలిష్ జీన్స్ వేసుకుని డిస్నీల్యాండ్‌లో ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేసింది ఈ సుందరి. డిస్నీల్యాండ్ ఎంట్రన్స్‌లో తన హ్యాపియెస్ట్ మూమెంట్‌ను క్లిక్‌మనిపించింది . ఆ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది.

ఇక పారిస్‌లో తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోను షేర్ చేసింది కృతి. హోటెల్ బాల్కనీలో నిలుచుని పారిస్ బ్యాక్‌గ్రౌండ్‌లో దిగిన ఈ పిక్స్ అందరిని ఎంతగానో ఆకర్షించాయి. మొత్తానికి తన హాలిడే వెకేషన్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. ఈ పిక్స్‌కు నెటిజన్లు క్రేజీ కామెంట్లు పోస్ట్ చేశారు. కొంత మంది కృతి సనన్ అత్యంత అందమైన నటి అని పొగిడేస్తుంటు మరికొంత మంది కృతి కన్నా ఈఫిల్ టవర్ కాస్త పొడవుగా ఉందని చెబుతున్నారు. మెజారిటీ ఫ్యాన్స్ మాత్రం ఈ పిక్స్ కింద హార్ట్ సింబల్స్‌ను పోస్ట్ చేసి తమ అభిమానాన్ని చూపించారు.

కృతి సనన్ తెలుగులో మహేష్ బాబు పక్కన నేనొక్కడినే చిత్రంలో నటించి మెప్పించింది. ఆ తరువాత బాలీవుడ్ చెక్కేసింది. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో డజన్ వరకు ప్రాజెక్టులు చేసింది. తాజాగా కృతి రోహిద్ ధావన్ దర్శకత్వం వహించిన షెహజాదా సినిమా కోసం కార్తిక్ ఆర్యన్ సరసన నటించింది. లేటెస్ట్‌గా టైగర్ ష్రాఫ్‌తో గణపత్, వరుణ్ ధావన్‌తో భేదియా చిత్రం చేస్తోంది. ఇటీవలె స్కామ్ 1992 డైరెక్టర్ హన్సల్ మోహతాను కలిసి తన భవిష్యత్తు ప్రాజెక్టు గురించి చర్చించింది. వీటన్నింటికన్నా ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ఆదిపురుష్‌లో నటిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సైఫ్ అలీఖాన్ కలిసి నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పౌరాణఇక ఇతిహాసం, రామాయణం ఆధారంగా తెరకెక్కబోతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.