Kriti Kulhari : పాపులర్ వెబ్ సీరీస్ ఫోర్ మోర్ షార్ట్స్ ప్లీజ్ మూడవ సీజన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విజయవంతంగా దూసుకెళుతోంది. ఈ వెబ్ సీరీస్ సక్సెస్‌ను నటి కృతి కుల్హారీ ఎంజాయ్ చేస్తోంది. కృతి కుల్హారీ ఈ బోల్డ్ వెబ్ సీరీస్‌లో అంజనా మీనన్ పాత్రను పోషిస్తోంది. ఈ సీరీస్‌లో కృతి నటనకు గాను మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఓ నలుగురు అమ్మాయిల జీవిత ప్రయాణం లో ఏర్పడే రిలేషన్స్ , ఎమెషన్స్ గురించిన కాన్సెప్ట్ తో ఫోర్ మోర్ షార్ట్స్ వెబ్ సీరీస్ కొనసాగుతుంది. ఇదివరకే వచ్చిన రెండు సీరీస్‌లు ప్రేక్షకులను అమితంగా అలరించాయి. కాస్త బోల్డ్ కంటెంట్ ఉన్నా ఈ సీరీస్‌లో నటించిన స్టార్స్ కు మంచి గుర్తింపు లభించింది.

Kriti Kulhari : తాజాగా కృతి పోర్ మోర్ షార్ట్స్ వెబ్ సీరీస్ ప్రమోషన్ ఫ్యాషన్ డైరీస్ నుంచి కొన్ని చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో పంచుకుంది. ఈ హాట్ పిక్స్ కృతి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పింక్ కలర్ అవుట్‌ఫిట్‌తో హాట్ పోజుల్లో దిగిన పిక్స్‌లో కృతి అందరిని మంత్రముగ్ధులను చేస్తోంది.

ప్రమోషన్ ఫోటో షూట్ కోసం కృతి ఫ్యాషన్ డిజైనర్ పాయల్ సింఘాల్ కు మ్యూస్ గా వ్యవహరించింది. డిజైనర్ లేటెస్ట్ కలెక్షన్స్ నుంచి స్టన్నింగ్ పింక్ అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుంది కృతి. టర్టిల్ నెక్ డీటైల్స్, క్వార్టర్ స్లీవ్స్ తో అత్యద్భుతంగా డిజైన్ చేసిన పింక్ కలర్ సాటిన్ డ్రెస్‌లో ఎంతో హాట్ గా కనిపించింది కృతి. తొడ వరకు వచ్చిన స్లిట్ నుంచి ఆమె థైస్ అందాన్ని చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

కృతి తన పింక్ అవుట్‌ఫిట్‌కు మ్యాచ్ అయ్యే విధంగా స్టైలిస్ట్ జ్యువెల్లరీని ఎన్నుకుంది. హౌజ్ ఆఫ్ శ్రీ పారామణి జ్యువెల్స్ నుంచి సేకరించిన వెండి డ్యాంగ్లర్ ఇయర్ రింగ్స్‌ను చెవులకు అలంకరించుకుంది. చేతికి సిల్వర్ బ్రేస్‌లెట్ పెట్టుకుంది. ఇక హౌజ్ ఆఫ్ ఎరుమ్మీ జ్యువెల్లరీస్ నుంచి ఉంగరాలను సేకరించి చేతి వేళ్లకు పెట్టుకుంది. క్రిస్టియన్ లౌబౌటిన్ నుంచి ఎన్నుకున్న క్లాసిక్ పింక్ కలర్ హీల్స్‌ను పాదాలకు తొడుక్కుని తన లోని స్టైలిష్ లుక్స్‌ను ఫ్యాన్స్‌కు పరిచయం చేసింది.

మేకప్ ఆర్టిస్ట్ శ్వేతా మెల్వానీ కృతి అందానికి మెరుగులు దిద్దింది. కనులకు న్యూడ్ ఐ ష్యాడో, మస్కరా, లాడెన్ ఐ ల్యాషెస్, దిద్దుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని గ్లామరస్ లుక్స్‌తో అందరిని ఇంప్రెస్ చేసింది.

అంతకు ముందు కృతి కుల్హారీ అద్భుతమైన మల్టీకలర్ గౌన్ వేసుకుని ప్రమోషన్ ఫోటో షూట్ చేసి ఫ్యాషన్ ప్రియులను మెస్మరైజ్ చేసింది. నడుము దగ్గర వచ్చిన కటౌట్ డీటైల్స్, తొడ వరకు వచ్చిన స్లిట్ అవుట్‌ఫిట్‌కు స్పెషల్ అట్రాక్షణ్‌ను తీసుకువచ్చాయి. ఇక టాప్ లో వచ్చిన డీప్ నెక్‌లైన్‌తో కీర్తి తన ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. కుర్రాళ్లకు నిద్ర లేకుండ చేస్తోంది.
