Kriti Kulhari : క్రితి కుల్హారీ ప్రస్తుతం తన వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ , కొత్త సీజన్ విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయబడిన రెండు సీజన్‌లలో వచ్చిన ఈ సిరీస్ యూత్‌ను ఓ రేంజ్‌లో ఆకర్షించింది. ఫ్రెండ్‌షిప్, లైఫ్, లవ్ , హేట్రేడ్ ను ఫేస్ చేసే నలుగురు అమ్మాయిల లైఫ్ ట్రావెల్‌ను కాస్త బోల్డ్ కంటెంట్‌ను జోడిస్తూ ఈ సీరీస్‌ను రూపొందించారు డైరెక్టర్‌లు. క్రితితో పాటు, ఈ సిరీస్‌లో సయానీ గుప్తా, బని జె ,మాన్వి , గాగ్రూ కూడా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో రాబోతున్న సీజన్ ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతోంది క్రితి కుల్హారి.

Kriti Kulhari : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తారల్లో క్రితి కుల్హారీ ఒకరు. ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫాలోవర్స్‌ను ఏదో రకంగా పలకరిస్తూనే ఉంటుంది ఈ చిన్నది. తన ప్రాజెక్ట్ అప్‌డేట్స్ , ఫోటో షూట్స్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటుంది. తాజాగా తన వెబ్ సీరీస్ ప్రమోషన్‌ను ఫ్యాషన్‌తో చేసేస్తోంది క్రితి కుల్హారీ. ఫోర్ మోర్ షార్ట్స్ మిడ్ వీక్ ప్రమోషన్స్ కోసం ఫార్మల్ అవుట్‌ఫిట్‌ను ఎంచుకుని ఫ్యాషన్ ప్రియుల మనసును దోచేసింది.

ఫ్యాషన్ డిజైనర్ హౌజ్ ఎగ్జాంపిల్ కు మ్యూస్‌గా వ్యవహరించింది క్రితి కుల్హారీ. ఈ ప్రమోషనల్ ఫోటో షూట్ కోసం క్రితి కో -ఆర్డ్ సెట్‌ను వేసుకుని బాస్ లేడీ గెటప్‌లో ప్రమోషన్స్‌లో గ్లామర్‌ను జోడించింది. లేస్ డీటైల్స్, ఫుల్ స్లీవ్స్‌తో వచ్చిన బ్లాక్ షార్ట్ డ్రెస్ వేసుకుంది. దాని పై నుంచి వైట్ ,పాస్టెల్ గ్రీన్, వయోలెట్ , బ్లాక్ రంగులో షేడ్స్ తో వచ్చిన స్ట్రిపెడ్ బ్లేజర్ ధరించింది.

తన లుక్‌ను మరింత అట్రాక్టివ్‌గా మార్చుకునేందుకు ఈ చిన్నది నడుముకు వైడ్ బ్లాక్ బెల్ట్‌ను పెట్టుకుంది. పాదాలకు బ్లాక్ ఫుట్‌వేర్ వేసుకుని చెవులకు స్టేట్‌మెంట్ ఎమెరాల్డ్ హూప్ ఇయర్‌రింగ్స్‌ను అలంకరించుకుని పర్ఫెక్ట్ లుక్‌తో కుర్రాళ్లను ఫిదా చేసేసింది.

ఫ్యాషన్ స్టైలిస్ట్ హౌజ్ హూ వోర్ వాట్ వెన్ క్రితికి స్టైలిష్ లుక్స్‌ను అందించింది. తన కురులతో మధ్యపాపిట తీసి క్లీన్ పోనీటెయిల్‌ను వేసుకుంది . కనులకు పింక్ ఐ ష్యాడో, ఐలైనర్ మస్కరా, పెదాలకు న్యూడ్ లిప్ షేడ్ పెట్టుకుని మంత్రముగ్ధులను చేసింది. ఈ అవుట్‌ఫిట్‌తో దిగిన పిక్స్‌ను క్రితి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఫ్యాన్స్ ఆమె లుక్స్‌ను చూసి క్రేజీ కామెంట్లు చేసేస్తున్నారు.
