Krithi Shetty – vaishanav tej: తాజాగా 67వ సౌత్ ఫిలిం ఫైర్ అవార్డు కార్యక్రమం ఘనంగా జరిగింది. బెంగుళూరు లోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఈ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్లో స్టార్ హీరో హీరోయిన్లు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్ విచ్చేశారు.
ఇక ఈ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా తెలుగు, తమిళం,మలయాళం కన్నడ పరిశ్రమలలో 2020-2021 మధ్య వచ్చిన సినిమాలకు అవార్డులను అందజేశారు. ఇకపోతే ఈ అవార్డు కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ ని పలువురు హీరో హీరోయిన్లు ఉత్తమ నటుడు ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు.
అలాగే ఈ ఫిలిం ఫేర్ అవార్డులలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అలాగే హీరో వైష్ణవ్ తేజ్ ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఉప్పెన సినిమాకు గాను బెస్ట్ డెబ్యూ హీరోగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు హీరో వైష్ణవ తేజ్.
అలాగే ఉప్పెన సినిమాకు గాను బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా కృతి శెట్టి ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు పెట్టడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరితో పాటుగా అల్లు అర్జున్, సాయి పల్లవి, నాని లాంటి సెలబ్రిటీలు కూడా ఈ అవార్డును కైవసం చేసుకున్నారు.
మరీ ముఖ్యంగా పుష్ప సినిమాకు గాను ఎక్కువగా అవార్డులు వచ్చాయి అని చెప్పవచ్చు. ఇకపోతే వైష్ణవ్ తేజ్,కృతి శెట్టి విషయానికి వస్తే.. వీరిద్దరూ కలిసి ఉప్పెన సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో కృతి శెట్టి, వైష్ణవి తేజ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో ఇద్దరు ఉప్పెనలా దూసుకు వచ్చారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విషయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.