ఉప్పెన మూవీతో తెలుగు ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్ గా మారిన కృతి సెట్టి ప్రస్తుతం బడా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటుంది. నాగ చైతన్య,రామ్ చరణ్ మూవీస్ లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ఈ మూవీలకి భారీ రెమ్యునరేషన్ అందుకుంటుంది.ప్రస్తుతం ఇదే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
తాజాగా కృతి సెట్టిని దర్శకుడు విరించి వర్మ కలిశారట.ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను ఆమెకు నేరేట్ చేశారు.కథ బాగా నచ్చిన కృతి సెట్టి మూవీ చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కానీ రెమ్యునరేషన్ కోట్లలో అడగడంతో దర్శకుడు షాక్ అయ్యాడట.మరి కృతి కోరిన రెమ్యునరేషన్ ను విరించి వర్మ ప్రొడ్యూసర్స్ ఇస్తారో లేదో వేచి చూడాలి.