Krithi Shetty: హీరోయిన్ కృతి శెట్టి మనందరికీ సుపరిచితమే. ఈమె మెగా హీరో వైష్ణవి తేజ్ నటించిన ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే తన అందం అభినయం నటనతో యూత్లో భారీగా క్రేజ్ ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ.
దీంతో ఈ సినిమా విడుదల తర్వాత కొద్దిరోజులపాటు సోషల్ మీడియాలో కృతి శెట్టి పేరు మారుమోగిపోయింది. అంతేకాకుండా ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. కేవలం ఒక్క సినిమా తోనే స్టార్ హీరోయిన్ల రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది అంటే అర్థం చేసుకోవచ్చు.
కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ నూతన ఖాతాలో వేసుకుంది. కృతి శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో ఈమె ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కృతి శెట్టి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈమె అందాల ఆరబోతను మొదలు పెట్టేసింది. అవకాశాలు పెరగడంతో అందాల ఆరబోతను కూడా పెంచేసింది.
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా కృతి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె బ్లూ కలర్ సారీ ధరించి మత్తెక్కించే చూపులతో యువత దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆ బ్లూ కలర్ శారీలో లేలేత అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.