Krithi Shetty: కృతి శెట్టి.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ఉప్పెన. టాలీవుడ్ హీరో వైష్ణవి తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యింది కృతి శెట్టి. మొదటి సినిమానే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా మొదటి సినిమాలో తన అందం అభినయం నటనతో యూత్ లో ఫుల్ గా మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ.
ఎంట్రీ ఇవ్వడంతోనే ఉప్పెనలా దూసుకు రావడంతో ఈమెకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. మొదటి సినిమాతోనే విపరీతమైన ఫాలోయింగ్ ని ఏర్పరచుకోవడం తోపాటు వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే బోలెడు సిని ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
ఇది ఇలా ఉంటే ఉప్పెన తర్వాత ఈమె నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ప్లాప్ అవుతున్నాయి. అంతే కాకుండా ఇటీవలే విడుదలైన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అన్న సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఈమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి కానీ సినిమాలు మాత్రం హిట్ అవ్వడం లేదు.
అయితే ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా కృతి శెట్టి ఏమాత్రం తగ్గడం లేదు. యంగ్ హీరోలతో పాటు, అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు కూడా దక్కించుకుంటోంది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో అరడజనుకు పైగా సినిమాలే వున్నాయి.
అందులో అక్కినేని హీరో నాగ చైతన్య తో ఒక సినిమా చేస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో అవకాశాలు ఎక్కువ అవుతుండడంతో తన అందాలను కూడా మరింత పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే దుస్తుల విషయంలో కూడా కాస్త మితిమీరి అందాల ప్రదర్శన చేస్తోంది అని చెప్పవచ్చు.
ఈమధ్య పొట్టి డ్రస్సులలో ఎక్కువగా దర్శనమిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇలా ఉంటే తాజాగా కృతి శెట్టి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె లాంగ్ లెన్త్ ఉన్న డ్రెస్సులు ధరించినప్పటికీ స్టైలిష్ లుక్ తో అదరగొడుతుంది.