Krithi Shetty: టాలీవుడ్‌లో ఇప్పుడు కన్నడ భామల హవా నడుస్తోంది. తెలుగు నాట టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న పూజా హెగ్డే, రష్మికా మందన్న లాంటి వాళ్లు కన్నడిగులే. వీళ్ల లిస్టులో యంగ్ బ్యూటీ కృతి శెట్టి కూడా చేరింది. కర్ణాటకకు చెందిన కృతి.. చేసింది తక్కువే సినిమాలైనా ఇక్కడ స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. ‘ఉప్పెన’ చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలతో మరింత పాపులారిటీని సాధించింది.
హాట్ ఫొటోషూట్స్‌తో రచ్చ..
ఇకపోతే, కృతి శెట్టి ఈ మధ్య మరీ ఓవర్ చేస్తోందని కొందరు సినీ ప్రముఖులు. వరుసగా హిట్లు సాధిస్తూ అగ్ర హీరోయిన్ల జాబితాలోకి చేరిన ఈ అమ్మడును.. తమ చిత్రాల్లో ఏరికోరి మరీ తీసుకుంటున్నారు స్టార్ హీరోలు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇటీవల ఈమె నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నితిన్, రామ్, సుధీర్ బాబుతో నటించిన మూవీస్ డిజాస్టర్ కావడంతో కృతి డైలమాలో పడింది. ఎలాగైనా సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ.. తన పేరు జనాలు మర్చిపోకుండా గుర్తుచేస్తోంది కృతి.
బాలీవుడ్‌కు కృతి నో?
ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఓ బంపర్ ఆఫర్ దక్కింకుంది కృతి. ఇదివరకే నాని ‘శ్యామ్ సింగరాయ్’.. హిందీలో రీమేక్ చేస్తున్న సమయంలో కృతి శెట్టికి ఆఫర్ వచ్చింది. అయితే ఈ అవకాశాన్ని ఆమె ఓపెన్ గా రిజెక్ట్ చేసింది. అప్పుడైతే తెలుగులో అవకాశాలు ఉన్నాయి.. కానీ ఇప్పుడు అలా కాదు. వరుస ఫ్లాపులతో ఈ అమ్మాయి డౌన్ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఆ చాన్స్ వదులుకోదు. కానీ కృతి మాత్రం తాను అన్న మాటకే కట్టుబడి ఉంటానని హిందీ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కృతి శెట్టి తన పేరు, పాపులారిటీని మరింత పెంచుకోవడానికి.. అలాగే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడానికి బాలీవుడ్ బడా ఆఫర్ ను కూడా తోచిపుచ్చిందని సమాచారం
Krithi Shetty: వీళ్లను ఫాలో అవ్వాల్సిందే..!
కాగా, కృతి శెట్టి ఒకే ఇండస్ట్రీపై ఎందుకింత ఆధారపడుతోందని కామెంట్లు వస్తున్నాయి. బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నా రిజెక్ట్ చేసి.. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమ మీదే ఆధారపడటం సరికాదని ఆమె అభిమానులు అంటున్నారు. కాజల్, సమంత, తాప్సీ, రకుల్ లాంటి స్టార్ హీరోయిన్లు తెలుగులో క్రేజ్ వచ్చినా.. తమిళం, హిందీ భాషల సినిమాల్లోనూ వాళ్లు నటిస్తూ వచ్చారు. కృతి కూడా వీళ్లను అనుసరిస్తే బాగుంటుందని.. ఆమె నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచిస్తున్నారు.